టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మొదటి నుంచి మీడియా మేనేజ్ మెంట్ లో సిద్ధహస్తుడన్న పేరుంది. అంతే కాదు.. అసలు తెలుగులోని ఆ రెండు అగ్ర పత్రికలు లేకపోతే చంద్రబాబు పొలిటికల్ కేరీరే లేదనే విశ్లేషకులూ ఉన్నారు. ఈ రెండు పత్రికల్లో తోక పత్రిక అంటే కాస్త రీసెంట్ గా వచ్చి చేరింది కానీ... మరో అగ్ర పత్రిక మాత్రం.. మొదటి నుంచి అంటే చంద్రబాబు ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా ఉన్నప్పటి నుంచి అండగా ఉండి కాపాడుకుంటూ వస్తోందన్న సంగతి జగద్విదితం.

 

 

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి.. సీఎం అయినప్పుడూ.. ఆ తర్వాత కాలంలోనూ చంద్రబాబుకు అండగా నిలిచింది ఆయన అనుకూల మీడియానే. అసలు నిజాలు దాచి.. ఏ పరిణామాన్నైనా చంద్రబాబుకు అనుకూలంగా మలచి.. ఈ పత్రికలు చేసిన సేవ అసామాన్యం. అయితే.. ఇప్పుడు సీన్ మారిపోయింది. అసలే వైఎస్ సాక్షి పేరుతో పోటీ పత్రిక పెట్టి ఎప్పటికప్పుడు చంద్రబాబు రాజకీయ ఎత్తుగడలను, తప్పులను చీల్చి చెండాడటం మొదలయ్యాక.. జనానికి చంద్రబాబులోని మరో కోణం ఏంటో తెలియడం మొదలైందనే చెప్పాలి.

 

 

ఇక ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యుగంలో, డిజిటల్ యుగంలో చంద్రబాబు ఎత్తులు అస్సలు పారడం లేదు. ఆయన అనుకూల పత్రికలు ఎంతగా జాకీ లేసి లేపినా.. ఉపయోగం ఉండటం లేదు. ఇదందా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్రభావమే. సో.. ఇప్పుడు జనం రాజకీయ విశ్లేషణల కోసం.. కేవలం పత్రికలనే ఆశ్రయించడం బాగా తగ్గింది. నిమిష నిమిషానికీ.. డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విశ్లేషణలు వస్తున్నాయి. కేవలం కొన్ని పత్రికలను నమ్మే రోజులు పోయాయి. దీనికితోడు ఫేస్ బుక్, యూట్యూబ్ ల ద్వారా ఎందరో విశ్లేషకులు ప్రతి పరిణామం వెనుక ఉన్న అసలు గుట్టును బయటపెడుతున్నాయి.

 

 

ఈ నేపథ్యంలో ఓ రిపోర్ట్ చంద్రబాబుకు దడ పుట్టిస్తోంది. అదేంటంటే.. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం భారత అడ్వర్టయిజ్ మెంట్ రంగం ఆదాయంలో డిజిటల్ రంగంలో పెరుగుదల ఏకంగా 32 శాతంగా ఉందట. మొత్తం ఆదాయంలో 20 శాతం ఈ రంగానిదే .ఇక పత్రికల విషయానికి వస్తే ఈ పెరుగుదల కేవలం 5 శాతం మాత్రమే కావడం మరో షాకింగ్. అంటే డిజిటల్ మీడియాలో ఏకంగా 32 శాతం పెరుగుదల ఉంటే.. టీవీలో 8 శాతం, పత్రికల్లో 5 శాతం ఉందన్నమాట. అంటే ఇక మీడియాను మేనేజ్ చేయడం చంద్రబాబుకు మరింత కష్టం కాబోతోందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: