తన అనుచరుల ముందు ఎలా మాట్లాడుకున్నా.. జనం ముందుకు వచ్చినప్పుడు.. కాస్త రాజకీయ నాయకులు పద్దతిగా మాట్లాడతారు. సంస్కారం మనసులో ఉన్నా లేకపోయినా.. ఉన్నట్టు నటిస్తారు. రాజకీయ నాయకుడు అంటేనే అంతే కదా.. కానీ కొంత మంది మనసులో ఏముంటే అదే చెప్పేస్తారు.. మనసుకూ.. మాటకు మధ్య ఫిల్టర్ అనేది ఉండదు.

 

 

అలాంటి వారిలో విశాఖ జిల్లా టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఒకరు. జనం చూస్తే చాలు ఆయనకు పూనకం వస్తుంది. స్వచ్ఛమైన విశాఖ యాసలో ప్రసంగం లాగిస్తారు. అదే ప్రసంగంలో కాస్త ఘాటుగా, నాటుగా కూడా మాట్లాడతారు. తాజాగా.. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ములగపూడిలో టీడీపీ నేత వరుపుల రాజా జనచైతన్య యాత్ర చేపట్టారు.

 

 

ఈ యాత్రలో మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, చింతకాయల అయ్యన్నపాత్రుడు, తెలుగుదేశం పార్టీ మహిళాఅధ్యక్షురాలు వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు. వేదికపై ఇలాంటి పెద్దలంతా ఆశీనులయ్యారు. అయితే వేదికపై ఓ మహిళా నేత అనిత ఉందని కూడా మరిచిపోయిన అయ్యన్నపాత్రుడు.. నాటు భాషలో మాట్లాడారు.

 

జగన్ ప్రభుత్వం మద్యం ధరలను పెంచిందని చెబుతూ.. పాపం మద్యం తాగేవారికి రోజూ 50 అదనపు భారం పడుతోందని చెప్పారు. దీన్ని ఏడాదికి లెక్కలేసి జనం.. పప్పు బెల్లం జనం చేతిలో పెట్టి.. ఏడాదికి లక్షన్నర రూపాయలు దెం** స్తున్నాడు అంటూ బూతులు వాడేశారు. ఏదో ఒకసారి అంటే ఫ్లోలో వచ్చిందనుకోవచ్చు.. కానీ ఆయన రెండు మూడు సార్లు అదే బూతు వాడేశారు. పాపం.. వేదికపై ఉన్న వంగలపూడి అనిత ఆయన బూతులు వినలేక.. అందరూ నవ్వూతు ఉంటే.. ఎటో చూస్తూ కవర్ చేసుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: