ప‌సిపిల్ల‌ల‌లో వివిధ రకాల అనారోగ్యాలను తీర్చే సాధారణ మందులుగా యాంటీ బయాటిక్ లను పేర్కొంటారు. యాంటీ-బయాటిక్ లను తీసుకోటానికి ముందుగా వీటి గురించిన కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకోవాలి. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది. నిజాలు మిమ్మల్ని ఆర్చర్యపరుస్తాయి. యాంటీ బయాటిక్ మాత్రలను పిల్ల‌ల‌కు వేయ‌టానికి ముందుగా, వీటి గురించి కొన్ని నిజాలు మీరు తప్పక తెలుసుకోవాలి. వీటి వలన కలిగే ప్రయోజనాల కారణంగా కనుగొన్నప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి మందుల చీటీలో వైద్యులు వాడమని రాస్తున్నారు. వీటి వాడకం వలన ఎలాంటి అనర్థాలు కలగవు. కానీ, అధిక మొత్తంలో వీటిని తీసుకోవటం వలన సమస్యలు కలగవచ్చు. యాంటీ బయాటిక్ ల గురించి ఈ రోజు బుడుగులో తెలుసుకుందాం...

 


యాంటీ బయాటిక్ లు అన్ని రకాల అనారోగ్యాలను నయం చేయలేవని గుర్తు పెట్టుకోండి. శరీరంలో వైరల్ ఇన్ఫెక్షన్ లు కలిగినపుడు కాకుండా, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కలిగినపుడు మాత్రమే యాంటీ బయాటిక్ లను వాడమని డాక్ట‌ర్లు స‌ల‌హా ఇస్తారు. యాంటీ బ్యాక్టీరియా మందులను తీసుకున్న తరువాత, శరీరంలో బ్యాక్టీరియాలకు నిరోధక శక్తిని పెంచుతాయి. దీని వలన కొన్ని సందర్భాలలో బ్యాక్టీరియాలకు చికిత్స చేయటం కష్టం అవుతుంది.

 


యాంటీ బ్యాక్టీరియాలను ఎప్పటికి ఎంచుకోకండి. ఎందుకంటే, ఇవి మంచి మరియు చెడు రెండు రకాల బ్యాక్టీరియాలను చంపి వేస్తాయి. యాంటీ బ్యాక్టీరియాల వలన శరీరంలో ఉండే మంచి బ్యాక్టీరియాలతో పాటుగా, పేగులలో ఉండే మంచి బ్యాక్టీరియాలను కూడా నాశనం చేయటం వలన వివిధ అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. మితిమీరిన స్థాయిలో యాంటీ బయాటిక్ లు రోగనిరోధక స్థాయిలను తగ్గించి, వివిధ ఇన్ఫెక్షన్ లను కలిగించటం ఆశ్చ‌ర్యానికి గురి చేసే విషయమనే చెప్పాలి. రోగ నిరోధక వ్యవస్థను ప్రభావిత పరచటమే కాకుండా, పేగులో ఉండే మంచి బ్యాక్టీరియాలను నాశనం చేసి వివిధ రకాల సమస్యలను కలుగచేస్తాయి. మితిమీరిన స్థాయిలో యాంటీ బ్యాక్టీరియాల సేకరణ మీ ఆరోగ్యానికి హానికరమనే చెప్పాలి.

 


యాంటీ బ్యాక్టీరియాల వలన శరీరంలో కలిగిన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లను, వీటి ద్వారా కలిగిన సమస్యలను కూడా తగ్గించి వేస్తాయి. ఎవరైనా తరుచుగా జ్వరం లేదా ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లకు గురవటానికి ముఖ్య కారణం- పోషకాల లోపం అని చెప్పవచ్చు. యాంటీ బయాటిక్ లు సాధరణంగా వైద్యుడిచే వాడమని సూచించబడతాయి మరియు చాలా సురక్షితం అని చెప్పవచ్చు. కానీ, కొంత మంది శరీరంలో ఇవి అలర్జీ చర్యలను కలుగచేస్తాయి. యాంటీ బయాటిక్ లకు సున్నితత్వం కలిగి ఉన్న వారు వీటిని వాడటం వలన తీవ్రమైన మరియు దీర్ఘకాలిక సమయం పాటూ సమస్యలను గురవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: