సాధారణంగా కాలేజ్ ప్రిన్స్ పాల్ అంటే చాలా స్ట్రిక్టుగా ఉంటారు. విద్యార్థులకు ఏమాత్రం చనువు ఇచ్చినా తన నెత్తికెక్కి గోల గోల చేస్తారని చాలా మంది ప్రిన్సిపాల్స్ భావిస్తారు. అందుకే చాలా స్ట్రిక్టు మెయింటైన్ చేస్తుంటారు. కానీ.. ఉత్తర్ ప్రదేశ్ లోని మావో జిల్లాలో ఓ కాలేజ్ ప్రిన్సిపాల్ మాత్రం చాలా డిఫరెంట్.

 

ఎందుకంటే.. ఆయన చాలా స్టూడెంట్స్ ఫ్రెండ్లీ అన్నమాట. ఎంత ఫ్రెండ్లీ అంటే పరీక్షల్లో ఎలా కాపీ కొట్టాలో కూడా ఆయనే విద్యార్థులకు సలహాలు ఇస్తారు. పాపం.. ఆయన తాజాగా ఎలా కాపీ కొట్టాలో విద్యార్థులకు బోధిస్తూ అడ్డంగా బుక్కయాడు. యూపీలో మంగళవారం నుంచి బోర్డు పరీక్షలు ప్రారంభమయ్యాయి.

 

మావో జిల్లాలోని హరివంశ్ మెమొరియల్ ఇంటర్ కాలేజ్ యాజమాన్యం తమ విద్యార్థులను పరీక్షలకు సమాయత్తం చేసేందుకు ఓ సమావేశం ఏర్పాటు చేసింది. అందులోనే ప్రిన్సిపాల్ ప్రవీణ్ మాల్ విద్యార్థులకు కాపీ ఎలా కొట్టాలో చెబుతూ వీడియోకు చిక్కాడు.

 

పాఠశాలల్లో తనకు చాలామంది మిత్రులున్నారని ఎలాంటి భయం లేకుండా పరీక్షలు రాయాలని సూచించాడు. పరీక్ష రాసేటప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చని, ఒకవేళ మాట్లాడుకుంటూ దొరికిపోయినా రెండు చెంపదెబ్బలు వేసినా భరించాలని చెప్పుకొచ్చాడు. ఆన్సర్ షీట్ ఖాళీగా ఉంచకుండా అందులో ఓ వంద రూపాయల కాగితం పెడితే టీచర్లు ఖుషీ అయిపోతారట.

 

అంతా బాగానే ఉంది కానీ.. తమకు ఇంతగా సాయం చేస్తున్న ఆ ప్రిన్సిపాల్ హితోపదేశాన్ని ఓ విద్యార్థి రహస్యంగా రికార్డు చేశాడు. అంతే కాదు.. పోలీసులకు కంప్లయింట్ కూడా ఇచ్చేశాడు. దీంతో ప్రవీణ్ మాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: