ప్రపంచ దేశాలను గజ్జున వణికిస్తున్న కోరోనా వైరస్ ఇప్పుడు చైనాలోనే కాదు ఇతర దేశాల్లో సైతం మరణ మృదంగం వాయిస్తుంది.  కోవిడ్-19 (కరోనా వైరస్) మరణమృదంగం కొనసాగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం, వైరస్ కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 2 వేలను దాటింది. బుధవారానికి 2,004 మంది మరణించారని, వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 74,185కు చేరిందని చైనా ప్రకటించింది.  జపాన్‌ తీరంలో క్వారంటైన్‌గా మార్చిన డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో మరో భారతీయుడు కొవిడ్‌-19 బారిన పడ్డాడు. దీంతో ఆ నౌకలో వైరస్‌ బారిన పడిన భారతీయుల సంఖ్య 8కి చేరింది. నౌకలో కొత్తగా 13 మందికి వైరస్‌ సోకినట్టు జపాన్‌ అధికారులు గురువారం ప్రకటించారు. 

 

మహమ్మారి ఇప్పుడు కొరియాకు  వ్యాపించింది. అక్కడ కూడా మరణాల సంఖ్యపెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే కరోనా జంతువుల నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నదని చైనా చెబుతుంటే.. ఇది చైనా తయారు చేసిన జీవాయుధమని మరికొందరు ఆరోపిస్తున్నారు. అయితే దక్షిణ కొరియాకు చెందిన ఓ చర్చి లీడర్ మాత్రం తమ దేశంలో కరోనా వ్యాప్తికి కారణం దెయ్యం అంటున్నారు. దేవుడిపై నమ్మకానికి పెట్టిన పరీక్ష ఇదంటూ చెప్తున్నారు. తమ చర్చి ఎదుగుదలను ఆపేందుకు దెయ్యమే కరోనాను వ్యాప్తి చేస్తోందన్నారు. దేవుడిపై నమ్మకం పెట్టుకోవాలని పేర్కొన్నారు.  

 

1984లో స్థాపించిన షించెయోంగి చర్చి పెద్ద అయిన లీ మన్ హీ తమ చర్చికి వచ్చే చాలా మందిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో తమ యాప్ లో ఓ పోస్టు పెట్టాడు. ఇదిలా ఉంటే  నిన్న కోవిడ్‌కు 114 మంది చనిపోగా ఒక్క హుబెయ్‌ ప్రావిన్స్‌లోనే 108 మంది మృత్యువాతపడ్డారు. దీంతో కోవిడ్‌ మృతుల సంఖ్య 2,118కి చేరింది. కోవిడ్‌ ప్రభావం హెబెయ్‌, వూహాన్‌లోనే అత్యధికంగా ఉంది. ఏది ఏమైనా ఎవరు ఏమనుకున్నా కరోనా పేరు వింటేనే వణికిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: