ఆయనొక్కరే కాదు...ఆయనతో పాటు చాలా మంది వస్తున్నారు..! సకుటుంబ సపరివార సమేతంగా భారత్‌లో అడుగుపెడుతున్నారు...! తొలిసారిగా భారత్‌ పర్యటనకు వస్తున్న ట్రంప్ ఫ్యామిలీ మెంబర్స్ అందర్నీ ఎయిర్‌ఫోర్స్ వన్ ఎక్కిస్తున్నారు..! ప్రెసిడెంట్ అండ్ ఫస్ట్ లేడీ మాత్రమే కాదు... కూతురు అల్లుడు కూడా హలో ఇండియా అంటూ అహ్మదాబాద్ వస్తున్నారు.

 

అమెరికా అధ్యక్షుడి భారత్ టూర్‌కు కౌంట్ డౌన్ మొదలయ్యింది. సోమవారం ఉదయం ట్రంప్ అహ్మదాబాద్‌లో ల్యాండ్ అవుతారు. 24, 25 రెండు రోజుపాటు మోడీతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ట్రంప్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా భారత పర్యటనకు వస్తున్నారు. సాధారణంగా అమెరికా అధ్యక్షుడితో పాటు ఫస్ట్ లేడీ కూడా విదేశీ పర్యటనల్లో పాల్గొంటారు. ఇప్పుడు ట్రంప్‌తో ఆయన భార్య , మెలానియాతో పాటు కుమార్తె అల్లుడు కూడా వస్తున్నారు.

 

ఈ నెల 24న అమెరికా నుంచి వస్తున్న ఉన్నత స్థాయి బృందంలో ఇవాంకా ట్రంప్‌ కూడా ఉంటారని అధికారిక వర్గాలు ప్రకటించాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ట్రంప్‌తో పాటు ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ పర్యటన మాత్రమే ఖరారయ్యింది. అయితే తాజాగా ఇవాంకాతో పాటు ఆమె భర్త జరెద్ కుష్‌నర్ కూడా వస్తున్నారు. అమెరికా అధ్యక్షుడితో పాటు భారత్ వచ్చే ఆ దేశానికి చెందిన ఉన్నత స్థాయి కమిటీలో వీళ్లు కూడా సభ్యులు. ట్రంప్‌ కుటుంబ సభ్యులుగా కాకుండా అధికారిక హోదాలోనే వీళ్లు మనదేశంలో పర్యటిస్తున్నారు. ఇవాంకాతో పాటు అల్లుడు జరెద్ కుషనర్‌ కూడా వైట్‌హౌస్‌లో ట్రంప్‌కు సలహాదారులుగా ఉన్నారు.

 

అహ్మదాబాద్ చేరుకుని రోడ్‌షోలో పాల్గొన్న తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంను ట్రంప్ ప్రారంభిస్తారు. మోడీతో కలిసి ప్రసంగిస్తారు. ఆతర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఆగ్రా వెళ్లి తాజ్‌ మహల్ అందాలను ఆశ్వాదిస్తారు... 25న ఢిల్లీ వెళ్లి ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. సకుటుంబ సపరివార సమేతంగా భారత్ వస్తుండటంతో వాళ్లకు తప్ప ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: