ప్రపంచంలో కరోనా సృష్టిస్తున్న విధ్వంసం చాలా భయంకరంగా ఉంది. ఒక మనిషిని మరో మనిషి నమ్మలేని స్దితిలో ప్రజలు జీవిస్తున్నారు. చైనాలో అయితే పరిస్దితులు మరీ దారుణంగా ఉన్నాయి.. ఇక కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే చాలు, అది నిజంగా కరోనా కాదా అనే విషయన్ని కూడా ఆలోచించకుండా మనుషులను కుక్కలకంటే హీనంగా చూస్తున్నారు... ఇకపోతే చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 76 వేల మందికి సోకిందని. ఈ మహమ్మారి బారిన పడి  2వేల 247మంది ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయారని అంటున్నారు. ఇది నిజామో కాదో తెలియదు కానీ, ప్రపంచ దేశాలకు వ్యాపిస్తున్న ఈ వ్యాధి పీడితుల లెక్కలు  మాత్రం తప్పుగా చెబుతున్నారని అనిపిస్తుంది.

 

 

ఎందుకంటే ఒక వైపు చైనాలోనే ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే కేవలం మరణాల సంఖ్య మాత్రం అంత తక్కువగా ఉండటం అనుమానం కలిగిస్తుందని అనుకుంటున్నారు.. ఇదిలా ఉండగా ఈ వైరస్ వల్ల ఇప్పటికీ ప్రపంచ దేశాలు చైనాపై నిషేధం కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ దేశంలో దారుణం జరిగింది. అదేమంటే కరోనా పేషంట్లు ఉన్నారనే అనుమానంతో ఆందోళనకారులు గురువారం ఆరు బస్సులకు  పెట్రోల్ పోసి నిప్పంటించారట.  

 

 

ఇందులో 45 మంది ఉక్రెనియా వాసులు, 27 మంది విదేశీయులు వుహాన్ నుంచి ఖార్కివ్ ప్రాంతానికి వచ్చారట.. అలా వచ్చిన వారందరినీ ఆరు బస్సుల్లో నోవి సంఝారీ హాస్పిటల్‌కు టెస్టుల నిమిత్తం తీసుకొచ్చి, వారి అరోగ్య స్దితిగతులు పరిశీలించి, 14 రోజుల తర్వాత ప్రత్యేక బలగాలతో వేరే ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది.. ఇకపోతే  చైనాలోని వుహాన్ నుంచి వచ్చినందుకు అనుమానంతోనే ఆందోళనకారులు ఇలా చేశారని నిజానికి బస్సులో ఉన్న వారు ఎవరూ కరోనా రోగులు కాదని ఆరోగ్య శాఖ చెప్పింది..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: