అవును చంద్రబాబునాయుడుకి ఎంతో సన్నిహితుడు దుబాయ్ కేంద్రంగా పారిశ్రామికవేత్తగా పాపులరైన బిఆర్ శెట్టి దాదాపు దివాలా అంచుల్లో ఉన్నాడు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాష్ట్ర రాజకీయాల్లో, ప్రభుత్వ వ్యవహారాల్లో తరచూ ఈయన పేరు వినిపిస్తునే ఉంటుంది. కర్నాకటకు చెందిన శెట్టి అక్కడ రాజకీయాల్లో ఎంత పేరుందో తెలీదు కానీ ఏపి రాజకీయాల్లో మాత్రం చాలా ప్రముఖుడనే చెప్పాలి.

 

ఈ శెట్టిని చంద్రబాబు అమరావతికి కూడా పిలిపించాడు. అమరావతి ప్రాంతంలో  చాలా చీప్ గా 100 ఎకరాలను కూడా కట్టబెట్టేశాడు.  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా చైన్ ఆఫ్ హాస్పిటల్స్ పెట్టాడు. ఈ రంగంలో ప్రపంచంలోని బాగా పేరున్న వాళ్ళల్లో ఒకడైన శెట్టిగారి తెరవెనుక కత ఒక్కసారిగా బయటపడిపోయింది. తన ఆసుపత్రులను అంతర్జాతీయ స్ధాయికి తీసుకెళ్ళాడు కాబట్టి షేర్ మార్కెట్లో కూడా ఎంటరయ్యాడు. ఆసుపత్రుల నిర్వహణ, విస్తరణకు అనేక ఆర్ధిక సంస్ధలు, బ్యాంకుల నుండి వందల కోట్ల రూపాయలు అప్పులు కూడా తీసుకున్నాడు.

 

ఇటువంటి ఆసుపత్రి ఒకటి అమరావతిలో కూడా పెడతానని శెట్టి అనగానే చంద్రబాబు 100 ఎకరాలు రాసిచ్చేశాడు. శెట్టిగారి ఆసుపత్రుల నిర్వహణ, ఆసుపత్రుల షేర్ల ధరలపై అనుమానం వచ్చిన ఓ బిజెనిస్ మ్యాగజైన్ ఈయన వ్యవహారాలపై ఓ కన్నేసింది. మొత్తం కూపి లాగింది. ఇంకేముంది ? శెట్టి బండారం మొత్తం బయటపడిపోయింది. ఆసుపత్రుల షేర్ల ధరలన్నీ పుస్తకాల్లో మాత్రమే చాలా ఎక్కువగా ఉంటాయని తేలిపోయింది.

 

లేని వ్యాపారాన్ని జరిగినట్లు చూపటం, సంస్ధకు లేని విలువను చాలా ఎక్కువగా చూపటం తదితర మోసాలన్నీ ఒక్కసారిగా బయటపడ్డాయి. ఇంకేముంది సంస్ధల షేర్ల ధరలు ఒక్కసారిగా కుప్ప కూలిపోయాయి. వ్యాపారాల విలువ నేలమట్టమైపోయింది. దాంతో వేల కోట్లు నష్టాలు చుట్టుముట్టాయి. దాంతో అప్పులిచ్చిన ఆర్ధిక సంస్ధలు, బ్యాంకులు లబోదిబో అంటున్నాయిపుడు. చంద్రబాబు-శెట్టి మధ్య చాల లింకులున్నాయని ప్రచారం ఉందిలేండి.  శెట్టి దివాలా తీస్తే ఆ దెబ్బ చంద్రబాబు మీద పడటం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. చూద్దాం ఏమవుతుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి: