రాను రాను మనుషుల్లో ఓపిక నశిస్తుంది.. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మనుషుల పట్ల కుక్కలకంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. ఇప్పుడు లోకంలో కౄరమృగాలకు భయపడే రోజులు పోయాయి. మనుషులకు మనుషులు భయపడే రోజులు వచ్చాయి.. చిన్న దానికి పెద్ద దానికి రౌడిల్లా ప్రవర్తిస్తూ, రాక్షసుల్లా మారుతున్నారు. మనుషుల ప్రాణాలంటే కోళ్లకంటే దారుణంగా మారిపోయింది. ఇదిగో ఇప్పుడు చదివే ఘటన తాలూకు విషయం తెలుసుకుంటే ప్రాణాలంటే ఎంత అలుసైయ్యాయో అని అనుకోక ఉండరు..

 

 

ఇకపోతే ఒక టీవి తన ప్రాణం తీస్తుందని ఆ వ్యక్తి ఊహించి ఉండడు.. వినడానికి సిల్లీగా అనిపిస్తున్న ఇదే నిజం.. ఇక ఆర్మూర్‌ పట్టణంలోని గోల్‌బంగ్లా ప్రాంతంలో నివసిస్తున్న రాజేందర్‌ (40) బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో ఇంట్లో టీవి చూస్తున్నాడు. అదే సమయంలో అతని ఇంట్లో అద్దెకు ఉంటున్న బాలనర్సయ్య అనే వ్యక్తి, తన భార్యతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో ఇంటి ఓనర్ పెట్టిన టీవి సౌండ్ అనేది అతనిలో కోపాన్ని మరింత పెంచినట్లు ఉంది..

 

 

ఈ క్రమంలో ఆవేశంలో ఉన్న బాలనర్సయ్య తన ఇంటి యజమాని రాజేందర్‌ దగ్గరికి వెళ్లి టీవీ సౌండ్‌ ఎక్కువగా ఎందుకు పెట్టావని తలపై బలంగా కొట్టాడు. దీంతో రాజేందర్‌ అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. ఆ వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా రాజేందర్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందాడని నిర్ధారించారు.

 

 

ఇకపోతే ఎస్‌హెచ్‌వో రాఘవేందర్, ఎస్సై యాదగిరి గౌడ్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించగా, అనంతరం, కేసు నమోదు చేసుకొన్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక మృతుడికి భార్య, ఒక కొడుకు ఉన్నారు... పాపం వారి ముఖం కూడా చూడకుండా ఒక ఆడపడుచు తాళిని ఎంత తేలికగా తెంచేసాడు ఈ మూర్ఖుడు.. అతని ఆవేశం వల్ల రెండు కుటుంబాలు అనాధగా మారాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: