ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలు ఎక్కువన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీలో ఈ వారసత్వ రాజకీయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతల కుటుంబాల నుంచి ఇప్పటికే చాలామంది వారసులు రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆఖరికి అధినేత చంద్రబాబు కూడా తన వారసుడు లోకేశ్ చేత రాజకీయాలు చేయిస్తున్నారు. మొన్న ఎన్నికల్లో లోకేశ్ తొలిసారి పోటీ చేసి ఓటమి కూడా పాలయ్యారు. ఇక లోకేశ్‌తో పాటు పలువురు సీనియర్ నేతల వారసులు కూడా పోటీకి దిగి ఓటమి పాలయ్యారు.

 

అయితే ఆ ఎన్నికల్లో కొందరు సీనియర్లు తమతో, తమ వారసులకు కూడా టికెట్ ఇప్పించుకోవాలని చూశారు. కానీ చంద్రబాబు మాత్రం ఎవరికో ఒకరికి మాత్రమే సీటు ఇస్తానని చెప్పడంతో, కొందరు సీనియర్లు పోటీ నుంచి తప్పుకుని తమ వారసులని ఎన్నికల బరిలోకి దింపితే, మరికొందరు వారే స్వయంగా పోటీ చేశారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి కూడా టీడీపీలో మరికొందరు కూడా తమ తనయులని బరిలోకి దింపాలని చూస్తున్నారు.

 

కాకపోతే వారసులతో పాటు వారు కూడా పోటీలో ఉండాలని అనుకుంటున్నారు. అలా రెండు టికెట్లు ఆశిస్తున్న ఫ్యామిలీల్లో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుటుంబం ముందు వరుసలో ఉంటుంది. అయ్యన్న మొన్న ఎన్నికల్లోనే తన తనయుడు చింతకాయల విజయ్‌ని పోటీ చేయించాలని అనుకున్నారు. కానీ బాబు ఒకే టికెట్ అని చెప్పడంతో, అయ్యన్ననే పోటీకి దిగి ఓడిపోయారు. అయితే ఈసారి మాత్రం ఇద్దరికి టికెట్ దక్కించుకోవాలని చూస్తున్నారు.

 

అటు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కూడా తన తనయుడు అప్పలనాయుడుకు సీటు తెచ్చుకోవాలని అనుకుంటున్నారు. ఇదే వరుసలో ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు తనయుడు మాగంటి రామ్‌కు, దర్శిలో మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు తనయుడు సుధీర్‌కు, సర్వేపల్లిలో మాజీ మంత్రి reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనయుడు రాజగోపాల్ రెడ్డికు, పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తనయుడు పల్లె క్రిష్ణ కిషోర్ రెడ్డికి టికెట్లు ఇప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: