మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన, ఎలాగోలా పార్టీ ముందుకు తీసుకెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు గత 9నెలలు నుంచి కష్టపడుతున్న విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని చెబుతూ, ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఓ వైపు జగన్ ప్రభుత్వంపై పోరాడుతూనే, మరోవైపు మళ్ళీ పార్టీని గాడిలో పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. అయితే బాబు ఎంత కష్టపడిన, ఆ పార్టీలో కొందరు నేతలు మాత్రం కష్టపడటం లేదు.

 

మళ్ళీ ఎన్నికల సమయంలో నియోజకవర్గాల్లోకి రావోచ్చని అనుకుంటూ ఉంటున్నారు. బాబుతో పార్టీ జెండా మోసేందుకు బయటకు రావడం లేదు. ముఖ్యంగా బాబు సొంత జిల్లా చిత్తూరు తెలుగు తమ్ముళ్ళు అయితే ఎన్నికల్లో ఓడిపోగానే, ఇళ్ల మీద జెండాలు పీకేసి సైలెంట్ అయిపోయారు. బాబు 9 నెలలుగా ఏదో కార్యక్రమం చేస్తున్న, సొంత జిల్లా నేతల నుంచి మాత్రం పెద్దగా స్పందన రావడం లేదు.

 

2019 ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 14 స్థానాల్లో టీడీపీ ఒక్క స్థానమే గెలిచిన విషయం తెలిసిందే. అది కూడా కుప్పం నుంచి చంద్రబాబే గెలిచారు. మిగిలిన 13 చోట్ల, రెండు ఎంపీ స్థానాల్లో వైసీపీదే విజయం. ఇక ఆయా నియోజకవర్గాల్లో ఓడిపోయిన నేతలు ఎవరు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం చేయడం లేదు. ఏదో పలమనేరులో ఓడిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాత్రం కాస్త జిల్లాలో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు.

 

పూతలపట్టులో లలిత కుమారి, గంగాధర నెల్లూరులో హరికృష్ణ, చిత్తూరులో ఏ‌ఎస్ మనోహర్, నగరిలో భాను ప్రకాష్, చంద్రగిరిలో పులిపర్తి నాని, తిరుపతిలో సుగుణమ్మ, సత్యవేడులో రాజశేఖర్, శ్రీకాళహస్తిలో gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డి, పుంగనూరులో అనీష రెడ్డి, మదనపల్లిలో దొమ్మలపాటి రమేశ్, పీలేరు నల్లారి కిషోర్, తంబళ్లపల్లి శంకర్ యాదవ్‌లు అడ్రెస్ లేరు. ఇక చిత్తూరు ఎంపీగా పోటీ చేసిన శివప్రసాద్ మరణించిన విషయం తెలిసిందే. ఇక తిరుపతి ఎంపీగా ఓడిపోయిన పనబాక లక్ష్మి అయితే కంటికే కనపడటం లేదు. మొత్తానికైతే సొంత జిల్లా వాళ్లే బాబుకు షాక్ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: