ఏంటి? కామెడీనా ? అని అనుకుంటున్నారా? కామెడీ కాదు అండి.. ఇది నిజం.. నిప్పులాంటి నిజం. అక్కడ రైల్వే స్టేషన్ లో ఆ మిషన్ ముందు గుంజీలు తిస్తె ఫ్రీ టికెట్ అంట. మీకు ఆశ్చర్యం వెయ్యచ్చు.. అంత సిన్ ఉందా అని.. కానీ ఇది నిజం. అయితే మీరు అనుకుంటున్నట్టు రైల్ టికెట్ కాదు.. ప్లాట్‌ఫామ్ టికెట్ ఫ్రీ గా వస్తుంది.  

 

ప్లాట్‌ఫామ్ టికెట్ అయినా ఎక్కడ ఫ్రీగా వస్తుందో తెలుసా? ఢిల్లీలో.. మనం ఎప్పుడైనా మన ఆప్తులను ట్రైన్ ఎక్కించడానికి రైల్వే స్టేషన్ కి వెళ్తే ఖచ్చితంగా ప్లాట్‌ఫామ్ టికెట్ తీసుకోవాలి.. లేదు అంటే భారీగా ఫైన్ కట్టాల్సి వస్తుంది. అయితే ఆ బాధ లేకుండా.. ప్లాట్‌ఫామ్ టికెట్ కొనుక్కోండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేలా గుంజీలు తిస్తె సరిపోతుంది. 

 

ఇంకా వివరాల్లోకి వెళ్తే ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. అందులో భాగంగానే ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో కొత్త ప్రయోగానికి తేరా తీశారు. గుంజీలు తీస్తే ఫ్రీగా ప్లాట్‌ఫామ్ టికెట్ జారీ అయ్యేలా ఓ మెషిన్ ను ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేశారు. ఆ మెషీన్ ముందు ఎవరైనా సరే కొన్ని గుంజీలు తిస్తె టికెట్ దానంతట అదే వచ్చేస్తుంది. సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ టికెట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: