కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సీ  పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలన్నీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో వ్యతిరేకత  వ్యక్తం చేస్తున్నాయి . పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు బిజెపియేతర రాష్ట్రాలు తాము తమ రాష్ట్ర పరిధిలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని ఇప్పటికే తేల్చి చెప్పారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకత వ్యక్తం చేస్తే... ఏపీ సీఎం జగన్ మద్దతు తెలిపారు. 

 

 

 ఇకపోతే గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సి కి కూడా మద్దతు తెలుపుతామని ప్రకటించిన విషయం తెలిసిందే.పౌరసత్వ  సవరణ చట్టం విషయంలో మోది  ప్రభుత్వాన్ని అనుమానిస్తే హిందువులను అనుమానిస్తున్నట్లు అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్థాకరే తెలిపారు. అయితే పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకించినప్పటికీ... కాంగ్రెస్ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడిన ఉద్దవ్ థాక్రే సర్కార్ మాత్రం  మోదీ సర్కార్ కు  మద్దతు ప్రకటించి... పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు ప్రకటించింది. 

 

 

 ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే  ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. సీఎం హోదాలో తొలిసారిగా హస్తినలో పర్యటించిన ఉద్దవ్థాకరే ఆయన కుమారుడు ఆదిత్య థాకరేతో కలసి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు . ఈ సందర్భంగా పౌరసత్వ సవరణ చట్టం జాతీయ పౌర పట్టిక జాతీయ జనాభా పట్టిక పై చర్చలు జరిగాయి. అనంతరం మీడియాతో మాట్లాడిన మహా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఏ ఒక్కరికి కూడా నష్టం జరగదు అంటూ తెలిపారు. అంతే కాకుండా జాతీయ జనాభా పట్టిక మహారాష్ట్రలో కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు. కాకా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ ఉద్దవ్ థాక్రే  భేటీ ఆసక్తికరంగా మారింది .

మరింత సమాచారం తెలుసుకోండి: