తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్షనేత చంద్రబాబు కి అత్యంత సన్నిహితంగా ఉండే నాయకులలో ఒకరు అచ్చెన్నాయుడు. చంద్రబాబు హయాంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు ఈఎస్ ఐ స్కామ్ లో ఇరుక్కున్నారు. దీంతో గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ పైన భయంకరమైన విమర్శలు అసెంబ్లీ సాక్షిగా చేయటంతో తాజాగా వచ్చిన అచ్చెన్నాయుడు ఆరోపణలు పై వైసిపి నాయకులు మీడియా ముందు సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా కార్మిక శాఖ మంత్రి వైసీపీ నాయకుడు గుమ్మలూరి జయరాం ఈ విషయంపై సంచలనం కామెంట్లు చేశారు. విషయంలోకి వెళితే ఈఎస్ ఐ స్కామ్ లో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు పాత్రకు ఆయన రాసిన లేఖే సాక్ష్యమని పేర్కొన్నారు.

 

గత ప్రభుత్వం చంద్రబాబు హయాంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి రాజ్యమేలుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరికిన చోటల్లా దోపిడీ చేశారు అనటానికి ఈ స్కామ్ వివరాలే తెలియజేస్తున్నాయి అని  కార్మిక శాఖ మంత్రి గుమ్మలూరి జయరాం అన్నారు. ఈఐఎస్‌ కుంభకోణంలో అక్రమాలకు పాల్పడినవారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని జయరాం స‍్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా దోచుకుందని ఆయన అన్నారు. అక‍్రమాలు చేసినవారిపై చర్యలు తీసుకోవడానికి విజిలెన్స్‌ విచారణకు ఆదేశించామన్నారు. మాజీమంత్రి అచ్చెన్నాయుడు అవినీతికి ఆయన రాసిన లేఖ సాక్ష‍్యమన్నారు. అక్రమంగా చెల్లించిన బిల్లుల సొమ్మును రికవరీ చేస్తామన్నారు. ఈ వ్యవహారంలో అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయమన‍్నారు.

 

కేవలం మూడు సంస్థలతో కుమ్మక్కై దోపిడీ చేశారని, మందుల ధరలను భారీగా పెంచేసే దోపిడీ చేశారని జయరామ్ అన్నారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త ఆంధ్ర రాజకీయాల్లో పెద్ద హైలెట్ అయింది. చాలామంది కేసు తీవ్రత బట్టి చూస్తే అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని అంటున్నారు చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు. అయితే మరోపక్క అచ్చెన్నాయుడు మాత్రం కావాలని తనని రాజకీయంగా అంతమొందించాలని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన వార్తలను ఖండించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: