ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటికీ ప్రాణభయంతో వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇక చైనాలో అయితే పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిపోతుంది రోజురోజుకీ. చైనా దేశంలో మరణ మృదంగం మోగిస్తున్న ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి... ఇప్పటికే 2 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు... అయితే ఈ సంఖ్య అనధికారికంగా ఇంకా భారీగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. అంతేకాకుండా డెబ్బై ఆరు వేల మందికి పైగా ఈ ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారినపడి మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. అయితే కేవలం చైనా దేశాన్ని కాదు యావత్ ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్నది ఈ  ప్రాణాంతకమైన వైరస్. ఇక ముఖ్యంగా ఈ వైరస్ గుర్తించబడిన హుబి  ప్రావిన్స్లో మాత్రం... పరిస్థితి రోజురోజుకు మరింత చేయి దాటి పోతుంది. 

 

 

 ఈ వైరస్కు సరైన విరుగుడు కూడా లేకపోవడంతో... ఈ వైరస్ సోకితే ప్రాణం పోవడం ఖాయం గా మారిపోయింది. అయితే చైనా దేశంతో పాటు మరో 26 దేశాలు కూడా ఈ ప్రాణాంతకమైన వ్యాధితో వణికిపోతున్నాయి.... అయితే ఈ కరోనా  భయం ఆందోళన కారులు ఉక్రెయిన్ లో  పెద్ద ఘోరం చేయడానికి కూడా వెనకాడలేదు. కరోనా  అనుమానితులుగా భావించి కొన్ని రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న వారిని వేరే చోటుకు తరలిస్తున్న సమయంలో.... వారికి కరోనా వైరస్ ఉందని వారికి భూమిపై బతికే ఛాన్స్ ఇవ్వకూడదు అంటూ.. కరోనా అనుమానితులను తరలిస్తున్న వారిపై దాడికి తెగబడ్డారు. ఉక్రెయిన్ సర్వీస్  సెక్యూరిటీ  నుంచి ఫేక్ ఇమెయిల్తో తప్పుడు సమాచారం అందడంతో .. ఆరోగ్య శాఖ మంత్రి జోర్యాన స్కాలేస్కా  ... స్కైప్ ద్వారా ఆందోళనకారులతో మాట్లాడి విషయాలను వెల్లడించారు. 

 

 

 

 అయితే గురువారం 45 ఉక్రేయిని  వాసులు 25 మంది విదేశీయులు కరోనా  వైరస్ కు కేంద్ర బిందువైన ఊహన్  నుంచి ఖార్కివ్  ప్రాంతానికి వచ్చారు.వారిని 6 బస్సుల్లో నోవి సంజూరి  హాస్పిటల్  కు కొన్ని టెస్టుల నిమిత్తం తీసుకొచ్చారు వైద్యులు. కాగా వారందరినీ పరిశీలనలో ఉంచి 14 రోజులపాటు... పరీక్షించి ఆ తర్వాత ప్రత్యేక బలగాలతో వేరే ప్రాంతానికి తరలిస్తున్న... సమయంలో  ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనా  వైరస్ కేంద్ర బిందువైన ఊహన్  నగరం నుంచి వచ్చినందుకు మాత్రమే ఇలా కొన్ని రోజుల పాటు వారిని పరిక్షించామని.. నిజానికి వారెవరు కరోనా రోగులు కాదు అంటూ ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ  ఉక్రెయిన్  ఆరోగ్య శాఖ.

మరింత సమాచారం తెలుసుకోండి: