ఇండియన్ రైల్వే... ప్రజలను ఆకర్షించేందుకు అప్పుడప్పుడు సరికొత్త ఆఫర్ లను  పెడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  అయితే ఆఫర్లు పెట్టడమే కాదు ఈ ఆఫర్ కి కొన్ని చిక్కుముడులు కూడా పెడుతూ ఉంటుంది. తాజాగా ప్రజలకు ఓ వినూత్న  ఆఫర్ ప్రకటించింది భారత రైల్వే శాఖ. ఇండియన్ రైల్వే తీసుకొచ్చిన ఈ కొత్త టెక్నాలజీ ద్వారా రైల్వే ప్రయాణికులందరూ ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే టికెట్ ను పొందడానికి వీలు ఉంటుంది. కానీ ఇక్కడే ఒక మెలిక పెట్టింది రైల్వేశాఖ. కేవలం ఊరికే టికెట్ ఇవ్వరు. రైల్వే శాఖ ఇచ్చిన ఓ టాస్క్   పూర్తి చేస్తేనే టికెట్ ఉచితంగా లభిస్తుంది. లేకపోతే డబ్బులు చెల్లించాల్సిందే. ఈ క్రమంలోనే ప్రయాణికులు అందరినీ ఆకర్షించేలా సరికొత్త ఆలోచనని  తెరమీదికి తెచ్చింది.

 

 ఇంతకీ ఆ టాస్క్ ఏంటి.. ఏం చేయాలి అనేది తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే.  ఇండియన్ రైల్వే కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. రైల్వే ప్రయాణికుల ఫిట్నెస్ను ప్రోత్సహించేందుకు సరికొత్త ప్రయోగానికి ప్రారంభించింది ఇండియన్ రైల్వే. ఓ చిన్న పని చేస్తే చాలు ఇక పై రైల్వేస్టేషన్లో టికెట్లు ఫ్రీ గా తీసుకోవచ్చు. అయితే ఇది ఎవరో చెప్పింది కాదు స్వయంగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. దానికి సంబంధించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. 

 


 ఇంతకీ ఫ్రీ గా  టికెట్ పొందేందుకు ఏం చేయాలంటే... ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ లో కొత్త ఫిట్నెస్ మిషన్ ఏర్పాటు చేశారు. అయితే సరిగ్గా ఈ మిషిన్  ముందు నిలబడి 30 గుంజీలు తీస్తే ఉచితంగా ఫ్లాట్ఫామ్ టికెట్ వస్తుంది. ఈ మిషన్ తో ఆరోగ్యం మెరుగుపడటమే  కాదు.. తమ ఏంటో  ఫిట్నెస్ ప్రయాణికులు కూడా తెలుస్తుందని... అంతేకాకుండా డబ్బులు కూడా ఆదా అవుతాయి అంటుంది రైల్వే శాఖ.   అభివృద్ధి చెందిన దేశాల్లో  ఇప్పటికే ఇలాంటి పద్ధతులను అవలంభిస్తుంటారు అంటూ వెల్లడించింది. స్క్వాట్  అండ్ రైట్ పేరుతో సబ్ వే స్టేషన్ లో  ఈ మిషిన్లు  ఏర్పాటు చేశారు. అయితే ఇండియాలోనూ ఫిట్నెస్ మిషన్లు ఏర్పాటు చేస్తోంది రైల్వేశాఖ. త్వరలోనే దేశవ్యాప్తంగా  వీటిని తీసుకురానున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: