అర్ధరాత్రో లేక నిర్మానుష్య ప్రాంతంలో ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరిగితే ఎదో అనుకోవచ్చు.. కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోర్టు ఛాంబర్ లో ఓ మహిళాను దారుణంగా రేప్ చేసారు. మహిళలపై నేరాలకు అడ్డాగా మారిన ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. న్యాయదేవతకు నిలయైన కోర్టులో ఓ మహిళా లాయర్‌పై సహచరుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. డ్రగ్స్ కలిపి కూల్‌డ్రింగ్ ఆమెకిచ్చిన వ్యక్తి మత్తులోకి జారుకున్నాక లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ బాగోతాన్ని సెల్‌ఫోన్లో వీడియో తీశాడు.

 


బహేరీ ప్రాంతానికి చెందిన ఓ యువతి రూప్ కిషోర్ అనే సీనియర్ లాయర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. అక్కడే బబ్లూ అనే యువకుడు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఫిబ్రవరి 15 తేదీన సీనియర్ లాయర్ లేని సమయంలో ఓ కేసు గురించి మాట్లాడుకుందామని బబ్లూ ఆ యువతిని ఛాంబర్‌కు పిలిచాడు. మాటల్లో దించి డ్రగ్స్ కలిపి కూల్‌డ్రింక్ తాగించాడు. ఆమె మత్తులోకి జారుకున్నాక లైంగిక దాడికి పాల్పడి సెల్‌ఫోన్లో వీడియో తీశాడు.

 


పొద్దుననగా వెళ్లిన కూతురు ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ తల్లి దండ్రులు దగ్గరిలో ఉన్న అన్నీ ప్రాంతాల్లో వెతికారు చివరికి లాయర్ ఛాంజర్‌కు వెళ్లి చూడగా నగ్నంగా అపస్మారక స్థితిలో కనిపించింది. దీంతో వారు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. డ్రగ్స్ అతిగా ఇవ్వడంతో నాలుగు రోజుల వరకు బాధితురాలు కోలుకోలేకపోయింది. మెలకువ వచ్చిన తర్వాత ఏం జరిగిందని తల్లిదండ్రులు అడగ్గా తనపై జరిగిన అఘాయిత్యం గురించి వివరించింది.

 


డోస్ ఎక్కువ కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమె తన పై జరిగిన అఘాయిత్యం గురించి వివరించి చెప్పింది. వాంగ్మూలం తీసుకున్న పోలీసులు బబ్లూపై అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు తనను అకారణంగా యువతి తల్లిదండ్రులు కొట్టారని, వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని బబ్లూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె చెప్పిన ఫిర్యాదు మేరకు విచారణ చేపడుతున్నట్లు పోలీసులు అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: