కొన్ని రోజుల క్రితం గుజరాత్ లోని భుజ్ లో ఓ కాలేజీ వసతి గృహంలోని మహిళా టీచర్లు 68 మంది డిగ్రీ విద్యార్థినుల అండర్ వేర్లు విప్పించి మరీ వారికి నెలసరి అవుతుందో లేదో చెక్ చేసి అందరి ఆగ్రహానికి కారణమయ్యారు. ఆ దారుణమైన ఘటన మరవకముందే మళ్ళీ తాజాగా ఆడవారిని కించపరిచేలా ఉన్నతస్థాయిలో ఉన్న మహిళ డాక్టర్లు 100 మంది యువతులను తమ ఒంటి మీద నూలు పోగు లేకుండా నిల్చోబెట్టి వారిని అత్యంత దారుణంగా అవమానించారు.



వివరాల్లోకి వెళితే... ఫిబ్రవరి 20వ తేదీన సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న 100 మంది మహిళ క్లర్కులు వాళ్ల జాబ్ లో పెర్మనెంటుగా కొనసాగేందుకు ఒక మెడికల్ టెస్ట్ కి అటెండ్ అయ్యారు. ఐతే ఇప్పటికే వీళ్ళందరూ తమ 3 సంవత్సరాల ప్రొబేషన్/ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. అయితే గురువారం రోజు ఈ 100 మంది ట్రయినీ ఉద్యోగినులు సూరత్ మునిసిపల్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రికి వెళితే... అక్కడి గైనకాలజిస్టులు 10 మంది ట్రైనీల చొప్పున గ్రూపులు చేసి వారిని లోపలికి పిలిచి బలవంతంగా బట్టలు మొత్తం విప్పించి నగ్నంగా నిలబెట్టారు. వాస్తవానికి కేవలం ఒక్కొక్కరిని మాత్రమే పిలిచి చాలా గోప్యంగా చేసే ఈ మెడికల్ టెస్ట్ ని ఇలా అందరిముందు నిల్చోబెట్టి చేయడం అత్యంత అవమానకరం. ఇంకో దారుణమైన విషయమేంటంటే ట్రైనీలని నగ్నంగా నిల్చోబెట్టినప్పుడు కనీసం ఆ గది తలుపులు కూడా మూయలేదట. కేవలం ఓ డోర్ కర్టెన్ వేసే సరిపెట్టారట.



సాధారణంగా 3ఏళ్ల ప్రొబేషన్ పూర్తి చేసాక కంటి, చెవి, ముక్కు, గొంతు, గుండె, ఊపిరితిత్తుల లాంటి పరీక్షలు చేస్తారు. కానీ సూరత్ మున్సిపాలిటీ ఉద్యోగినులకు మాత్రం మెడికల్ ఫిట్నెస్ పేరిట వారి కన్యత్వాన్ని/గర్భధారణ పరిశీలిస్తూ జననేంద్రియాల్లో 'టూ ఫింగర్ టెస్ట్'లు నిర్వహించారు. గతంలో అత్యాచారానికి గురైన బాధితులకు టూ ఫింగర్ టెస్ట్ ని నిర్వహించి (లైంగిక చరిత్ర) సెక్సువల్ హిస్టరీని రాబట్టేవారు. కానీ ఇలాంటి అమానుషమైన పరీక్షలు ఆడవారి గౌరవానికి వ్యతిరేకమని సుప్రీంకోర్టు తో సహా పలు న్యాయస్థానాలు చెప్పుకొచ్చాయి. కానీ ఈ పురాతన పరీక్షను సూరత్ మున్సిపాలిటీ అధికారులు చేసి అందర్నీ షాక్ కి గురిచేస్తున్నారు.



ఈ ఊహించని అనుభవంతో అవమానంగా భావించిన ఉద్యోగినులు తమ ఉద్యోగ సంఘాల అధినేతలకు కంప్లైంట్ చేశారు. ఆ ఉద్యోగ సంఘ నేతలు ఈ విషయాన్ని మున్సిపాలిటీ కమిషనర్ బంచ్చనిదీ ఫణి దృష్టికి తీసుకెళ్లగా తాను ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి ఈ విషయంపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు మహిళా డాక్టర్లు మాట్లాడుతూ... రూల్స్ ప్రకారం ఈ పరీక్షని ప్రతిసారి నిర్వహిస్తామని చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఈ మహిళా ఉద్యోగినుల ఫింగర్ టెస్టుల వ్యవహారం వివాదాస్పదమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: