2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదిరిపోయే విజయాన్ని సాధించింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అదే సమయంలో స్పీకర్ గా ఎన్నికయ్యారు కిరణ్ కుమార్ రెడ్డి. అయితే అనుకోని సంఘటన వల్ల వైయస్ రాజశేఖర్ రెడ్డి మృతి చెందటంతో అప్పటి కేంద్ర లో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా రోశయ్య ని నియమించడం జరిగింది. అయితే రోశయ్య మాటని ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు వినకపోవడంతో పాటు ఎక్కడికి వెళ్ళినా రోశయ్య పై తిరుగుబాటు చేసే విధంగా పార్టీ పరిస్థితి తయారవడంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రోశయ్య పదవి నుండి పక్కకు తప్పించి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డికి పదవీ బాధ్యతలు ఇవ్వడం జరిగింది.

 

ఆ సమయంలో ఒకపక్క తెలంగాణలో ఉన్న కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని అధికార పార్టీపై ఒత్తిడి తీసుకురాగా మరోపక్క సీమాంధ్రలో విభజన జరగకూడదని దీక్షలు నిరసనలు చేపట్టడం జరిగింది. అయితే ఎట్టకేలకు 2014 ఎన్నికల ముందు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయం గా విభజించారు. ఇదే సందర్భంలో రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సమైక్యాంధ్ర పార్టీని పెట్టారు కిరణ్ కుమార్ రెడ్డి. ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో పాల్గొని ఘోరంగా ఓడిపోయారు. తరువాత కనుమరుగయ్యారు. ఇటువంటి నేపథ్యంలో చాలా కాలం తర్వాత మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ రాజకీయ తెరపైకి వచ్చారు. ఎపిసిసి సమన్వయ కమిటీలో ఆయన సభ్యుడు అయ్యారు.

 

కొత్తగా పిసిసి కార్యవర్గాన్ని,డిసిసి అద్యక్షులను కాంగ్రెస్ అదిష్టానం ప్రకటించింది. 11 మంది ఉపాధ్యక్షులు, 18 మంది ప్రధాన కార్యదర్శుల పేర్లను ఖరారు చేసింది. 29 మందితో కోఆర్డినేషన్ కమిటీ, 12 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేసింది. 18 మందిని డీసీసీ అధ్యక్షులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల​ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి రాజకీయ వ్యవహారాలు, స​మన్వయ కమిటీల్లో స్థానం కల్పించారు. మరి కొంతమంది నాయకులకి మరికొన్ని బాధ్యతలను పార్టీ హైకమాండ్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా కాలం తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెరపైకి రావడంతో ఈ వార్త ఏపీ లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: