లోకంలో కులం పేరు చెప్పుకుని బ్రతుకుతున్నట్లుగా, మతం పేరు చెప్పుకుని బ్రతికే వారు చాలామంది కనిపిస్తారు.. ఈ మతం అనేది ఉగ్రవాదం కంటే బలమైంది. మనుషులకు తెలికగా మత్తు ఎక్కిస్తుంది. ఇకపోతే క్రైస్తవ మతబోధకుడు బిషప్ ఫ్రాంకో ములక్కల్ చుట్టూ పాపాల చిట్టా ఉచ్చు బిగుస్తోందట.. ఇదివరకే ఒక క్రైస్తవ సన్యాసినిపై పలుమార్లు పాశవికంగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ములక్కల్ పై వివాదం ముదురుతున్న కొద్ది అతని బారిన పడిన వాళ్లు ఒక్కొక్కరు బయటికొస్తున్నారట. కాగా తాజాగా ములక్కల్ తనపైనా లైంగిక దాడులకు పాల్పడినట్లు, అంతటితో ఊరుకోకుండా, బలవంతంగా ముద్దులు పెట్టి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఈ సన్యాసిని ఆరోపించింది.

 

 

ఇకపోతే ఓ నన్‌పై అత్యాచారా కేసులో సాక్షిగా ఉన్న ఆమె పోలీసులకు ఈమేరకు వాంగ్మూలం ఇచ్చింది. ఎప్పుడు వేధించారనే ప్రశ్నకు సమాధానంగా ములక్కల్ నన్ను ‘2015-17 మధ్య కాలంలో   వేధించాడని పేర్కొంది.. ఆ సమయంలో ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకునేవాళ్లం. ఇదే అదనుగా భావించిన అతను నేను నన్‌ను అనే సోయి లేకుండా బూతులు మాట్లాడేవాడు. అంతటితో ఆగలేదు.. ఓసారి మా కాన్వెంటుకు వచ్చిన నన్ను గట్టిగా వాటేసుకుని ముద్దులు పెట్టాడని బాధితురాలు చెప్పింది.

 

 

ఇక ఈ విషయాన్ని బయటికి చెబితే అతని వల్లనాకు ఏదైనా హాని జరుగుతుందని భయపడి చెప్పలేదని వివరించింది. అయితే ఇకపైనా తాను నన్‌గా ఉంటానని, అందుకే  అతనిపై కేసు పెట్టడం లేదని పేర్కొంది. ఇకపోతే మిషనరీస్ ఆఫ్ జీసన్ సంస్థకు చెందిన ములక్కల్ తనపై పలుమార్లు అత్యాచారం చేశారని కొట్టాయం కాన్వెంటుకు చెందిన ఓ నన్ ఆరోపించడంతో రెండేళ్ల కిందటే ఇతని పై కేసు నమోదవగా, గత ఏడాది పోలీసులు చార్జిషీటు దాఖలు చేసి విచారణ చేపట్టారు.. ఇకపోతే లోకంలో ఇలాగే స్వామీజీలని, పెద్ద మనుషులమని చెప్పుకుంటూ నీతి మాలిన పనులు చేస్తున్న వారెందరో ఉన్నారు.. వారికే తెలియాలి తాము చేసే పని ఎంత నికృష్టమైందో అని అనుకుంటున్నారట కొందరు కామన్ పీపుల్..

మరింత సమాచారం తెలుసుకోండి: