ఛీ.. ఛీ.. ఛీ రోత మనుషులు, గలీజు ఆలోచనలు. ఆడవారంటే బొత్తిగా విలువ లేకుండా అయిపోతుంది.. ఎన్ని రకాలుగా మహిళలను వేధించాలో అన్ని రకాలుగా వేధిస్తున్నారు. మగవారితోనే కాకుండా, మహిళలకు, మహిళలతోనే అవమానాలు ఎక్కువవుతున్నాయి. ఈ మధ్యనే ఓ కాలేజీలో చదివే విద్యార్ధినులను బాత్రూంలోకి తీసుకెళ్లి వరుసగా నిలబెట్ట్ చెక్ చేసిన ఘటన మరవక ముందే, ఇలాంటి సంఘటనే మరోటి జరిగింది. అదేమంటే ఈ సారి వైద్య పరీక్షల కోసం మహిళలను నగ్నంగా నిలపెట్టి, టెస్టులు చేసారట..

 

 

అదీకూడా వారంతా అవివాహితులు, కనీసం ఈ టెస్టు చేసేవారికి ఏం ఆలోచన ఉందో కాని ఎవరైన పెళ్లి కాకుండా ప్రెగ్నెట్ అవుతే వారి ఇంట్లో వాళ్లూ ఊరుకుంటారా..  ఇక ఇంత ఘోరంగా సాటి మహిళలను అవమానించిన ఘటనకు సంబంధించిన విషయాన్ని తెలుసుకుంటే.. సూరత్ మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన మహిళా ట్రైనీలను, గ్రూపుగా వైద్య పరీక్షల పేరుతో నగ్నంగా నిలబెట్టి ప్రెగ్నెన్సీ టెస్టులు చేశారట. ఎస్ఎమ్సీ ఎంప్లాయీస్ యూనియన్ వారు ఇలా అవివాహితులను ప్రెగ్నెన్సీ టెస్టు పేరుతో వేధించడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి.

 

 

అంతేకాకుండా క్లర్క్‌లను మెడికల్ టెస్టులంటూ, నగ్నంగా గుంపులుగా నిలబెట్టడంపై భగ్గుమంటున్నారు. ఇకపోతే దీనిపై సూరత్ మునిసిపల్ కమిషనర్ బంచానిధి పానీ స్పందించి, ఈ ఆరోపణల్లో నిజాలు తేల్చేందుకు ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసి 15రోజుల్లోగా రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇకపోతే ట్రైనీ ఉద్యోగులు ట్రైనింగ్ పిరియడ్‌లో ఫిట్‌నెస్ నిరూపించుకోవాలి. అందుకోసమే ఇలాంటి టెస్టు చేసినప్పటికీ వారంతా చేసిన పద్ధతి బాగాలేదని అందరినీ ఒకేసారి నగ్నంగా నిలబెట్టడం సిగ్గుగా అనిపించిందని వాపోయారు.  

 

 

ఇదే కాకుండా ఒకరి తర్వాత ఒకరిని ఈ టెస్టు కోసం గదిలో పిలవడానికి బదులు.. ఒకేసారి 10మందిని వరుసగా నిలపెట్తి, ఇలా ప్రవర్తిమడం.. చట్ట విరుద్ధం.. మానవత్వానికి వ్యతిరేకం. ప్రతి మహిళపై ప్రత్యేక పరీక్షలు చేయాలి. కానీ పరీక్ష చేస్తున్న సమయంలోనూ మహిళలను లేడీ డాక్టర్లు అసభ్యకరమైన ప్రశ్నలతో వేధించారట.. వీరి మాటలకు ఈ ఉద్యోగం ఉంటే ఎంత, లేకుంటే ఎంత అని అనిపించిందట..

 

మరింత సమాచారం తెలుసుకోండి: