ఇప్పుడు ఇండియాలో ఎవరి నోటి వెంట అయినా దాదాపుగా వినిపించేది ఒకటే మాట, నలుగురి మధ్య నడిచేది ఒకటే చర్చ.. అదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇండియా పర్యటనకు వస్తున్నాడని.. మామూలుగా మన దేశానికి ఎవరైనా విదేశీ అతుధులు వస్తే వారికి మర్యాదల విషయంలో  ఏ లోటు ఉండదు. అలాంటిది, ప్రపంచదేశాల పెద్దన్న అయినా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వస్తున్నాడంటే.. ఆ హడావుడి మామూలుగా ఉండదు..

 

 

ఇకపోతే ఈ ‘ట్రంపు తెచ్చే కంపు వార్త గురించిన చర్చ చాలకాలం నుంచీ జరుగుతున్నదే. అసలు ఇంత నియంతలా వ్యవహరించే డోనాల్డ్‌ ట్రంప్‌ ఎలా గెలిచాడు.? అన్నది ఇప్పటికీ చాలామందికి అంతుపట్టడం లేదట..ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాలు అలా ఉంటాయి మరీ. ఇకపోతే కొన్నేళ్ళ క్రితం నాటి మాట ఏంటంటే ..  అమెరికా నడి వీధుల్లో, ట్రంప్‌ బొమ్మల్ని నగ్నంగా నిలబెట్టిన సందర్భాలున్నాయి. మనోడికి అక్కడ వున్న క్రేజ్‌ అలాంటిది మరి.! అయితే ఈ ఫాలోయింగ్‌కి అర్థం వేరే వుందట. అది సీక్రెట్ అని అంటున్నారు..

 

 

ఇక, అసలు విషయానికొస్తే, భారతదేశానికి,  ట్రంప్‌ వస్తున్నాడు. ఒక అమెరికా అధ్యక్షుడు, భారత్‌కి రావడమంటే ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఇక తాను గీసిందే గీతగా, తాను చెప్పిందే న్యాయం అనేలా వ్యవహరించే ట్రంప్ భారత్‌ నెత్తిన ఎలాంటి ‘పిడుగు’ పడేస్తాడన్నదానిపై చాలా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వం మాత్రం, అమెరికా అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది.

 

 

మురికి కాల్వలు కన్పించకుండా, అడ్డుగోడలు ఇప్పటికే కట్టేశారు. యమునా నదిలో కంపు పోగొట్టేందుకు నానా తంటాలూ పడుతున్నారు. కానీ, ట్రంపు నోటి కంపు మాత్రం పోవడంలేదు.. ఎందుకంటే భారతదేశం మీద చాలా వెటకారాలేస్తున్నాడాయన. ఇప్పుడే ఇలా వుంటే, ఇండియాకి వచ్చాక ట్రంప్‌ ఇంకెలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తాడో ఏమో. నిజానికి ట్రంప్ అతని అవసరం మీదే ఇండియా పర్యటనకు వస్తున్నాడట. కానీ, మన అవసరాల కోసం  అన్నట్లూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు.. ఇక మోడీ, ట్రంప్ మీరిద్దరి భేటీ.. దేశ ప్రయోజనాలకు ఎంతవరకు ప్రయోజనకారి.? అన్నది తెలియాలంటే కాస్త ఆగవలసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: