అవినీతి అనకొండల్లో ఒకటైన సుజనా చౌదరి  అవినీతి భాగోతం తాజాగా బయటపడింది. వ్యాపార విస్తరణకు బ్యాంకులో  తీసుకున్న అప్పును రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్ కు ఉపయోగించినట్లు బయటపడింది. దాంతో తమ దగ్గర తీసుకున్న అప్పును ఎగవేసినందుకు సదరు బ్యాంకు ఏకంగా సిబిఐకే ఫిర్యాదు చేసింది. దాంతో తొందరలోనే అనకొండ మోసంపై తొందరలోనే విచారణకు రంగంలోకి దిగబోతోంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే వ్యాపార విస్తరణ పేరుతో సుజనా చౌదరి చెన్నైలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా లో 322 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. అయితే తీసుకున్న అప్పుకు వాయిదాలను కట్టకపోగా అసలు అప్పునే తీర్చటం లేదు ఎన్నిసార్లు బ్యాంకు అప్పుగురించి అడిగినా లెక్కే చేయలేదు. దాంతో  తమ దగ్గర తీసుకున్న అప్పును వ్యాపార విస్తరణ కోసం కాకుండా అమరావతి సిఆర్డీఏ పరధిలో కొనుగోలు చేసిన వందలాది ఎకరాల రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించినట్లు బ్యాంకు అధికారులు నేరుగా సిబిఐకి ఫిర్యాదు చేశారు.

 

బ్యాంకులో అప్పు తీసుకునేటపుడు కేంద్రమంత్రిగా ఉన్న కాలంలో పై స్ధాయి నుండి ఒత్తిడి తీసుకొచ్చి అప్పు తీసేసుకున్నాడు. కట్టాల్సొచ్చేటప్పటికి మొహం చాటేశాడు. సుజనా చరిత్ర మొత్తం ఇదే విధంగా ఉండటం విశేషం. అవసరానికి అప్పులు తీసుకోవటం తర్వాత ఎగ్గొటడం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి, మారిషస్ బ్యాంకు నుండి కూడా వందల కోట్ల రూపాయలు అప్పు తీసుకుని ఎగ్గొట్టిన చరిత్ర ఈ అనకొండ ఖాతాలో ఉంది లేండి.

 

వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నా ఏ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోతోంది. పైగా చంద్రబాబునాయుడు రాజ్యసభ ఎంపిని చేయటమే కాకుండా పట్టుబట్టి మరీ కేంద్రమంత్రిని చేయటమే విచిత్రం. ఇటువంటి ఆర్ధిక నేరగాళ్ళకు రాజ్యాంగబద్దమైన అధికారాలు కూడా తోడవుడటంతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. సిఆర్డీఏ ప్రాంతంలో తాను కొనుగోలు చేసిన భూముల ధరలు పడిపోతాయన్న భయంతోనే రాజధానిని తరలించేందుకు లేదంటూ పదే పదే  జగన్మోహన్ రెడ్డిని బెదిరిస్తున్నారని అర్ధమైపోయింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: