తొందరలోనే తెలుగుదేశంపార్టీకి చెందిన ఓ బిగ్ వికెట్ డౌన్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ బిగ్ వికెట్ వెంటే మరో చిన్న వికెట్ పడిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు.  ఇంతకీ విషయం ఏమిటంటే టిడిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏల్లో శ్రీకాకుళం జిల్లా ఎంఎల్ఏ, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఓ అవినీతి భాగోతంలో తగులుకున్నారు.  తాజాగా బయటపడిన సుమారు వెయ్యి కోట్ల రూపాయల ఇఎస్ఐ స్కాంలో అచ్చెన్నదే ప్రధాన పాత్రగా ఆరోపణలు పెరిగిపోతున్నాయి.

 

మొత్తం స్కాంకు సంబంధించి విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్  విచారణలో భారీ కుంభకోణమే బయటపడింది. ప్రభుత్వానికి అందించిన నివేదికలో అచ్చెన్న పాత్రకు ఆధారాలున్నట్లు స్పష్టంగా చెప్పింది.  సరే స్కాంలో తనపేరు బయటపడిన తర్వాత ఎవరైనా అవును నిజమే అని ఒప్పుకుంటారా ? ఇపుడు అచ్చెన్న కూడా ఇదే పని చేస్తున్నారు. తాను నియమ, నిబంధనల ప్రకారమే నడుచుకున్నట్లు చెబుతున్నారు. పైగా ప్రధానమంత్రి ఆదేశాలను అమలు చేసినట్లు చెప్పుకుంటున్నారు.

 

సరే ఎవరి వాదన ఎలాగున్నా విజిలెన్స్ విచారణపై యాక్షన్ తీసుకోవాల్సింది రాష్ట్రప్రభుత్వమే అన్న విషయం అందరికీ తెలిసిందే.  కాబట్టి బయటపడిన స్కాంలో ముందుగా రిపోర్టులోని ఆధారాల ప్రకారం కేసులు పెట్టబోతున్నట్లు సమాచారం. అంటే అచ్చెన్నపైన కూడా కేసు నమోదు ఖాయమని తేలిపోతోంది. అంటే తొందరలోనే అచ్చెన్న అరెస్టు ఖాయమన్నట్లే. ఒకసారి అరెస్టు చేస్తే తర్వాత బెయిల్ తీసుకుని బయటకు రావటం తర్వాత కోర్టుల చుట్టూ తిరగటం తప్పదనుకోండి అది వేరే సంగతి.

 

సరే ఈ విషయం ఇలాగుంటే విశాఖపట్నంలోని ఓ ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ పైన కూడా ఆరోపణలు బయటపడ్డాయి. ఈ ఎంఎల్ఏకి  ఏవియేషన్ అకాడమిలో పేరుతో ఓ కాలేజీ ఉంది. ఇందులో విద్యార్ధులను చేర్చుకునేటపుడు సౌకర్యాల పేరుతో భారీ ఫీజులను వసూలు చేస్తారు. అయితే తమకు చెప్పినట్లుగా సౌకర్యాలు ఎందుకు కల్పించటం లేదని అడిగినందుకు స్టూడెంట్స్ ను సెల్లార్ లో పెట్టి బంధించారన్న విషయం బయటపడింది. దాంతో విద్యార్ధులు గణేష్ పై కేసు పెట్టారు. అంటే ఇదే పద్దతి సంవత్సరాల తరబడి జరుగుతున్నా అధికారంలో ఉన్నాడు కాబట్టి చెల్లుబాటైపోయింది. విచిత్రమేమిటంటే ఇద్దరూ బిసిలే. అందుకనే బిసిలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అణగదొక్కేస్తోందంటూ టిడిపి రంకెలేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: