మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తనకు మాత్రమే తెలిసిన ఓ రహస్యాన్ని విప్పి చెప్పారు. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని మంత్రులంతా డమ్మీలేనట. అంతా ముఖ్యమంత్రి చెప్పినట్లే వింటున్నారు కానీ సొంత ఆలోచనే లేదని తాజాగా దేవినేని చెప్పిన రహస్యంతో అందరూ హాస్చర్యపోతున్నారు.  దేశంలో ఏ రాష్ట్ర మంత్రివర్గంలోనిది ఒక్క ఏపిలో మాత్రమే జరుగుతున్నట్లుగా దేవినేని చెప్పిన రహస్యమే మరీ విచిత్రంగా ఉంది.

 

నిజానికి అధికారంలోకి రాగానే జగన్ మంత్రులందరికీ పూర్తి స్వేచ్చనిచ్చారనే చెప్పాలి. ఎవరికి కేటాయించిన శాఖలను ఆయా మంత్రులే దగ్గరుండి చూసుకోవాలని, ప్రతి విషయానికి తన దగ్గరకు రావద్దని స్పష్టంగా చెప్పేశారు. మంత్రి, ప్రిన్సిపుల్ సెక్రటరి లేకపోతే కమీషనర్ స్ధాయిలోనే నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలని అందరి ముందే మంత్రులకు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. పైగా మంత్రులకు తెలియకుండా శాఖలో అత్యున్నత అధికారులు ఎవరు తన దగ్గరకు వచ్చినా ఎంటర్ టైన్ చేసేది లేదని చేప్పేశారు.

 

దాంతో చాలా శాఖల్లో మంత్రులు, ఉన్నతాధికారులే దాదాపుగా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. అలా తీసుకున్న నిర్ణయాలను ఫైనల్ గా జగన్ దృష్టికి తీసుకెళుతున్నారు. లేదా ఇద్దరిస్ధాయిలో  నిర్ణయం తీసుకోవటం సాధ్యంకాని కొన్ని విషయాలను మాత్రమే జగన్ తో మాట్లాడుతున్నారు. ఇది గడచిన తొమ్మిది నెలలుగా జరుగుతున్న వ్యవహారం.

 

అయితే దేవినేని మాత్రం మంత్రులంతా డమ్మీలయిపోయారని ఎలా చెబుతున్నారో అర్ధం కావటం లేదు. అసలు చంద్రబాబునాయుడు హయంలో ఏమి జరిగింది ? ప్రతి విషయంలోను చంద్రబాబుదే అంతిమ నిర్ణయమన్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు లేకపోతే చినబాబు మాత్రమే నిర్ణయాలు తీసుకున్నారు. చాలామంది మంత్రుల వ్యవహారాల్లో అంతమ నిర్ణయం చంద్రబాబు, చినబాబే తీసుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. నిజంగా డమ్మీలంతా చంద్రబాబు మంత్రివర్గంలోనే ఉండేవారు. బహుశా ఇపుడు కూడా తమ హయాంలో జరిగినట్లే జరుగుతోందని దేవినేని అనుకుంటున్నారేమో

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: