1987వ సంవత్సరంలో ఒక బాలిక తన తండ్రి తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని అలిగి ఇంటి నుండి పారిపోయింది. అలా పారిపోయిన ఆమె రామ్ గజమండి లోని సుకేట్ లో నివాసముంటున్న తన చుట్టాల ఇంటికి వెళ్లాలనుకుంది. మార్గమధ్యంలో తనకి ఒక గుర్తుతెలియని మహిళ పరిచయం అయింది. ఆ మహిళ రఫీక్ అనే వ్యక్తి తనని చుట్టాల ఇంటికి సురక్షితంగా తీసుకెళ్తాడని నమ్మబలికింది. కానీ బాలిక మాత్రం అందుకు ససేమిరా అని మొండికేసి నప్పటికీ మహిళ మాత్రం ఆ బాలకని బలవంతంగా రఫీక్ తో పంపించేసింది.



దీంతో రఫీక్ ఆ బాలికను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జిరాపూర్ లో ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత తనని వేరే ప్రదేశానికి తీసుకు వెళుతుండగా ఆమె ఎలాగోలా తప్పించుకుని రామ్ గజమండికి చేరుకొని సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ రోజు నుండి అతని కోసం పోలీసులు గాలించిన రోజంటూ లేదు. ఎట్టకేలకు దాదాపు 33 సంవత్సరాల తర్వాత రేపిస్ట్ రఫీక్ ని పోలీసులు పట్టుకోగలిగారు. దీన్ని బట్టి చూస్తే తప్పు చేసిన ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజున పోలీసుల చేతులకు చిక్కడం ఖాయమని తెలుస్తోంది. పోలీసులకు నిందితుడికి పట్టుకోవడానికే 33 సంవత్సరాలు పడితే... శిక్ష పడే లోపు అతడే సహజమరణం చెందుతాడని నెటిజన్లు మన న్యాయవ్యవస్థను ఎద్దేవా చేస్తున్నారు.



డిసెంబర్ 11, 1987వ సంవత్సరంలో సూపెరింటెండెంర్ అఫ్ పోలీస్ అధికారి అయిన రాజన్ దుశ్యంత్ మాట్లాడుతూ... బాలికని రఫీక్ అనే డ్రైవరు కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారం చేశాడని మీడియా ముందు చెప్పాడు. ఆ బాలిక వాంగ్మూలం తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం 32 సంవత్సరాల పాటు గురించి చివరికి ఇటీవల అతడిని పట్టుకున్నారు. అయితే రాలేదు ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: