మనిషికో రుచి.. జువ్వాకో బుద్ది అంటారు.  నిత్యం మనిషి గాలి, నీరు, ఆహారం లేనిది  బతికి ఉండలేరన్న విషయం తెలిసిందే.  అయితే ప్రపంచంలో కొంత మంది మాత్రం కొన్నింటిని మాత్రమే తీసుకొని జీవనం కొనసాగిస్తుంటారు.  కొంత మంది కేవలం చాయి, మంచినీరు, ఇతర పండ్లూ ఫలాలు బుజిస్తూ బతికేస్తుంటారు.  కానీ ఓ వ్యక్తి మాత్రం ఇరవై ఏళ్లుగా కేవలం ఇసుక తిని బతికేస్తున్నాడు.  ఇది వింటానికి విడ్డూరడంగా ఉన్నా వాస్తవం. ప్రకాశం జిల్లా కలసపాడుకు చెందిన కోటేశ్వరరావు. మహాశివరాత్రిని పురస్కరించుకుని నిన్న కర్నూలు జిల్లాలోని మహానందికి వచ్చిన ఆయన ఇసుక తింటూ కనిపించడంతో భక్తులు ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. అదేంటీ ఎవరైనా పలహారంగా పులిహోరా, దద్దోజనం, కొబ్బరి లేదా ఇతర తినుబండారాలు తీసుకుంటారు.. కానీ ఆ వ్యక్తి మాత్రం ఇసుక తీనడంతో అందరి దృష్టి అతనివైపునకు మల్లింది. 

 

అంతే కాదు క్షణాల్లో ఫొటోలు, వీడియోలు తీస్తూ సందడి చేశారు.  అయితే కొంత మంది భక్తలు కాస్త చొరవ చూపించి ఆయనను ఇలా ఎంత కాలం నుంచి చేస్తున్నారు.. దీని  వల్ల మీకు హాని కలగదా అని రక రకాల ప్రశ్నలు సంధించారు.  అందుకాయన బదులిస్తూ.. తన కోరిక నెరవేరితే ఇసుక తింటానని 20 ఏళ్ల క్రితం విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కుకున్నానని, కోరిక తీరడంతో అప్పటి నుంచి ఇసుక తింటున్నానని చెప్పుకొచ్చారు. భక్తులు ఎవరైనా దేవుడు ప్రసాదం ఇస్తే తింటానని, లేదంటే ఇసుకే తన ఆహారమని తెలిపారు. చిన్న పిల్లలు ఇసుక తినడం చూస్తుంటాం.. అది వారికి తెలియదు.

 

కొంత మంది పెద్ద అయ్యే వరకు చాటు మాటుగా ఇసుకు తినే వారు కూడా ఉంటారు.  అయితే ఇరవై ఏళ్లుగా ఇసుక తినడం అనేది మాత్రం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అంటున్నారు. దీనిపై  అక్కడి డాక్టర్ ఒకరు మాట్లాడుతూ.. ఇసుకలో ఐరన్, కాల్షియం, మినరల్స్ ఉంటాయని చెప్పారు. రోజూ ఇసుకను ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ అందుకు అనుగుణంగా మారుతుందని పేర్కొన్నారు. ఇది చాలా అరుదైన ఘటనగా ఆయన అభివర్ణించారు.  ఏది ఏమైనా ఈ ఘటన చూసి అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: