ఒకప్పుడు అమ్మాయిలకు చదువుకునేందుకు అవకాశమే ఉండేది కాదు. ఒకవేళ చదువుకున్న అతి తక్కువ చదివించి  ఆ తర్వాత పెళ్లి చేసేవారు. ఇప్పటి కాలంలో మాత్రం 25 నుంచి 30 ఏళ్లు వచ్చినా కూడా మహిళలు పెళ్లి  పైన ఆసక్తి చూపడంలేదు. తమ కాళ్ళమీద తాము నిలబడీ  ఏదైనా సాధించాక పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల నిర్ణయాన్ని గౌరవిస్తూ..వాళ్ళు  పెళ్లి చేసుకుంటాము  అని చెప్పినప్పుడు పెళ్లిళ్లు చేస్తున్నారు.కానీ  ఇప్పటికీ కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను చదివించేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. తొందరగా పెళ్లి చేస్తే బరువు తగ్గిపోతుంది అని భావిస్తున్నారు. ఎంతోమంది ప్రతిభ ఉన్న వాళ్లు కూడా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లి చదువుకు దూరమవుతున్నారు.

 

 

 ఇక్కడ తల్లిదండ్రులు అదే చేశారు.చదువంటే ఆ యువతి ప్రాణం... ఎంతో కష్టపడి చదువుతూ వస్తోంది... కానీ ఇంతలో తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలంటూ ఇబ్బంది పెట్టడం... చెల్లికి మంచి సంబంధం వచ్చింది అని చెల్లి పెళ్లి చేయాలంటే ముందు నీ పెళ్లి  చేయాలి అంటూ చెబుతున్నారు. అయితే తనకు  ఒక సంవత్సరం టైమ్  కావాలి అంటూ తల్లిదండ్రుల దగ్గర ప్రాధేయపడింది. అయినప్పటికీ తల్లిదండ్రులు మాత్రం పెళ్లి చేసుకోవాల్సిందిగా పట్టుబట్టారు. తనకు ఎంతో ఇష్టమైన చదువు వదలలేక తనువు చాలించింది. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది. 

 

 

 వివరాల్లోకి వెళితే... ఆంధ్ర ప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా బసవ కొత్తూరు లోని రామయ్య లక్ష్మీ దంపతుల కూతురు భారతి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలంటూ తల్లిదండ్రులు  ఒత్తిడి తీసుకురావడంతో మనస్థాపానికి గురై..ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది . ఇంతలో ఇంటికి వచ్చిన చిన్న కూతురు తన అక్క ఫ్యాన్ కు ఉరి వేసుకుని వేలాడుతున్నది  చూసి షాకయ్యింది.  వెంటనే పక్కింటి వాళ్ళని పిలిచింది. ఇక పక్కింటి వాళ్ళ సహాయంతో వెంటనే అక్క భారతిని సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో సరైన సదుపాయాలు లేకపోవడంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే ఇప్పుడే పెళ్లి చేసుకోనీ  చదువుకు దూరంగా ఉండడం ఇష్టంలేక భారతి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: