బెంగళూరులో సీఏఏ ను వ్యతిరేకిస్తూ ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమూల్య లియోనా అనే యువతి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ స్లోగన్ చేసింది. దాంతో ఆమెపై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే  తాము భారతీయులమని యువతి వెనుక బీజేపీ హస్తం ఉందన్న ఓవైసీ ..యువతితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మరోవైపు ఇది ముమ్మాటికి కాశ్మీర్ వ్యతిరేకులు.. పాక్ ప్రేరేపితుల పనే అయి బీజేపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో అమూల్య వ్యాఖ్యలపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ ద్రోహం కేసు నమోదు చేసిన పోలీసులు యువతిని కోర్ట్ లో హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్ట్ 14రోజుల కస్టడి విధించింది.

 

మరోవైపు అమూల్య వ్యాఖ్యలతో కొంతమంది చిక్ మంగళూరులోని ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఇదిలా ఉంటే  అమూల్య నిర్వాకాన్ని ఆమె తండ్రి తీవ్రంగా ఖండించారు. ‘‘అమూల్య చేసిన పని చాలా తప్పు. ఆమె కొందరు ముస్లింలతో చేరి నా మాట లెక్కచేయడం లేదు..’’అని ఆయన పేర్కొన్నారు.  తాజాగా పాకిస్తాన్‌ జిందాబాద్‌ అంటూ అమూల్య లియోనా నినాదంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి సద్దుమణుగక ముందే మరో యువతి ఫ్రీ కశ్మీర్‌ అనే కరపత్రాన్ని ప్రదర్శించి ప్రజాగ్రహానికి కారణమైంది.  ఆర్థ్రా అనే యువతి నిరసనకారుల వెనుక ప్లకార్డును పట్టుకుని నిలబడింది. ఆ ప్లకార్డు పోస్టర్‌లో ‘ముసల్మాన్, దళిత్‌ ట్రాన్జ్‌ ఆదివాసి ముక్త్‌’ అని రాసి ఉంది.  

 

ఆ పోస్టర్‌పై ఆందోళనకారులు వ్యతిరేకత వ్యక్తం చేశారు.  ఇది చూసి యువతిపై పలువురు దూసుకెళుతుండడంతో పోలీసులు యువతిని రక్షించి ఎస్‌.జే.పార్కు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. తర్వాత దీనిపై వివరణ ఇచ్చిన సెంట్రల్‌ విభాగపు డీసీపీ చేతన్‌సింగ్‌ రాథోడ్, యువతి పాకిస్తాన్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేయలేదని, ఆమె చేతిలో ముక్తి కాశ్మీర్, ముక్తి ముస్లిం, ముక్త్‌ దలిత్‌ అనే ప్లకార్డు ఉంది. ఆ క్షణంలో యువతిపై దాడికి పలువురు ప్రయత్నించడంతో ఆమెను రక్షించే క్రమంలో తాను ఈ పని చేశామని వివరణ ఇచ్చారు .  ప్రస్తుతం ఆమె తమ అదుపులో ఉందని తెలిపారు. అయితే  పాకిస్తాన్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేయటం సరికాదని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని  శ్రీరామ సేనా రాష్ట్ర సంఘ్ డిమాండ్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: