మాములు గా గుడికి వెళ్లే భక్తులు తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటారు. ఆ క్రమంలో భక్తులు కొన్ని కానుకలను దేవుడికి సమర్పిస్తుండటం చూస్తుంటాము. అలాంటిది ఒక్కోక్కరు ఒక్కోలా మొక్కులను చెల్లిస్తారు. అందరి దేవుడ్ల తో పోలిస్తే శివుడికి కానుకలు సమర్పించే భక్తులు ఎక్కువ నే చెప్పాలి. అందుకే  కొన్నీ ఆలయాల్లో భక్తుల మొక్కులతో బాగా ఫెమస్ అవుతున్నాయి.  అయితే ఓ శివాలయంలో సిగరెట్లతో మొక్కులను చెల్లితున్నారట. వినడానికి వింతగా ఉంది కదూ అవునండి మీరు విన్నది నిజమే.. 

 


వివరాల్లోకి వెళితే.. కోరుకున్న కోరికలు నెరవేరితే దేవుడికి ప్రజలు మొక్కులు చెల్లిస్తారు. ఈ నేపథ్యంలో కానుకలుగా నగదు, నగలు లేదా వస్తురూపంలో  మొక్కులు చెల్లించడం చూసే ఉంటారు. అయితే ఓ శివాలయంలో భక్తులు సిగరెట్లతో మొక్కులు చెల్లిస్తున్నారట.. వివరాల్లోకి వెళితే..  హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలోని లుట్రు మహాదేవ్ ఆలయం ప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరుగాంచింది.


 

 

ఈ ఆలయంలో ఎటువంటి కోరికలు కోరుకున్న కూడా నెరవేరతాయని భక్తుల నమ్మకం .. ఆ క్రమంలో మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారికి సిగరెట్లను మొక్కుగా సమర్పిస్తారు. ఇక్కడి శివలింగంపై సిగరెట్ ను ఉంచితే దానికదే వెలుగుతుందని భక్తులు నమ్మకం. ఈ ఆచారంతో ఆలయం ప్రాముఖ్యత మరింత పెరుగుతుందని ప్రముఖులు అంటున్నారు.

 

 


ఈ వింతను చూడటానికి ప్రతి ఏడాది శివరాత్రికి భక్తులు పోటెత్తి వస్తుండటం విశేషం. లింగం పై సిగరెట్ ఉంచితే దేవుడు కాలుస్తున్నారా అన్న విదంగా ఉన్న ఈ వింతను చూడటానికి భక్తులు కూడా ఆసక్తి చూపిస్తుండటంతో ఈ ఆలయ ప్రాముఖ్యత మరింత పెరుగుతూ వస్తుంది. ఇలాంటి ఆలయాలు ఇంకెక్కడా ఉన్నాయి. భక్తుల పిచ్చి తో దేవుడిని కూడా స్మోకర్ మరియు డ్రింకర్ చేస్తున్నారని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: