దేశ రాజకీయాల్లో స్మృతి  ఇరానీ  ఎంత కీలకపాత్ర పోషిస్తారో  తెలిసిన విషయమే. లోక్సభలో ఆమె స్వరాన్ని  వినిపిస్తూ భారతీయతను చాటి చెబుతూ ఉంటారు. అయితే తాజా స్మృతి  ఇరానీ  కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని ఆమెకి లోక్సభ నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువ ఉండేందుకు... కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యూహాత్మక అడుగులు వేశారు. ఈ క్రమంలోనే ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేలా... అమేథీ  నియోజకవర్గంలో సొంత ఇల్లు నిర్మించుకోనున్నారు స్మృతి ఇరానీ . అయితే నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేందుకే అమేథిలో సొంత ఇల్లు నిర్ణయించుకున్నట్లు స్మృతి ఇరాని వెల్లడించారు. 

 

 

కాగా  2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోట ఆయన అమేథీలో రాహుల్ గాంధీ పై  ఘన విజయం సాధించారు. ఈ క్రమంలోనే ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు... చేరువలో ఉండేందుకు వ్యూహాత్మకంగా  స్మ్రితి ఇరానీ అమేథీలో సొంత ఇళ్లు నిర్మించుకుంటున్నట్లు తెలుస్తుంది. చాలా రోజుల క్రితమే తాను ముంబైనీ  వదిలేసాను అని  ఇప్పుడు ఢిల్లీ అమేథీకి  మధ్య తిరుగుతూ ఉన్నాను అంటూ లక్నోలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు.2019 ఎన్నికల్లో విజయం తనది కాదు వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ...ఇది అమేథీ  ప్రజల విజయం అని  పేర్కొన్నారు. ఈ విజయంతో అమేథీ ప్రజలకు తాను  తోబుట్టువు అయ్యాను అంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.

 

 అమేథీ  ఎంపీగా తాను గెలిచాక... పదివేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆమె తెలిపారు.తాను  ప్రారంభించిన అభివృద్ధి పనులన్నీ ముగింపు దశకు చేరుకున్నాయి  అంటూ వ్యాఖ్యానించారు. అయితే నియోజకవర్గ ఎంపీగా ...ప్రజలకు ఎప్పుడు  అందుబాటులో ఉండేందుకు ఏకంగా నియోజకవర్గంలో సొంత ఇంటిని నిర్మించుకుంటుండడంతో అటు  బీజేపీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు సత్వర పరిష్కారం కాబోతున్నాయి అంటూ ఆనందంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: