అప్పుడప్పుడు లోకంలో జరిగే వింతలు చూస్తుంటే చాలా ఆశ్చర్యమేస్తుంది.. ఎందుకంటే చైనాలో కరోనా వైరస్ వ్యాపిస్తుందని ముందే చెప్పారని మనం విన్నాం. ఇక ఇప్పుడు మరో వింతైన వార్తను వింటే మాత్రం అసలు ఈ భూమి మీద ఏం జరుగుతుంది అని ప్రశ్నించుకుంటారు.. అదేమంటే పుట్టి పది రోజులు కూడా కానీ ఆవుదూడ తల్లిని విడిచి ఉండలేదు.. సొంతగా గడ్ది కూడ తినదు, దానికి తల్లిపాలు తప్పా మరేది తెలియదు..

 

 

ఇదే కాకుండా సామాన్యంగా పది రోజుల వయస్సు ఉన్న ఆవుదూడ గంతులు వేస్తూ ఎంతో ఉత్సాహంగా హుషారుగా ఉంటుంది. చూడటానికి ఎంతో సంతోషంగా ఉంటుంది. కాని ఇక్కడ మనం చెప్పుకునే విషయంలో మాత్రం విశేషం చాలా ఉంది.. ఎందుకంటే తల్లిని విడిచి, తల్లిపాలు తప్పా మరేది తెలియని ఆవుదూడ పాలు ఇస్తుందట.. అవునండి మీరు విన్నది నిజమే.. ఇక ఈ వింత జరుగుతుంది మరెక్కడో కాదు.. తెలంగాణాలోని నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌ మండలం కొత్తలోలం గ్రామంలో..

 

 

ఈ గ్రామంలో సొంతంగా డైరీఫామ్‌ నిర్వహిస్తున్న మహ్మద్‌ అజారుద్దీన్‌ అనే పాడిరైతు దగ్గరున్న ఓ జెర్సీ ఆవు ఐదురోజుల క్రితమే లేగదూడకు జన్మనిచ్చింది. ఇక శుక్రవారం దాని పొదుగు పెద్దది కావడాన్ని అజారుద్దీన్ గమనించాడు. దాన్ని తడిమి చూడగా ధారలా పాలు రావడం చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే గిన్నె తీసుకువెళ్ళి ఆ పాలు తీసాడు. ఇక ఈ విషయం గాలికంటే వేగంగా వ్యాపించడంతో ఆ ఆవు దూడని చూడటానికి జనం తండోప తండాలుగా వస్తున్నారు.

 

 

ఇలా ఉండగా ఇప్పుడు అధికారులకు కూడా ఈ వింత పరిస్దితి అర్ధం కాలేదు. ఇక ఈ సంఘటనతో ఈ దూడ ఆ చుట్టుపక్కల చాలా ఫేమస్ అయ్యింది. ఏది ఏమైనా ఇది మాత్రం వింతలో కెల్లా వింతైన విషయమని చెప్పవచ్చూ.. 

మరింత సమాచారం తెలుసుకోండి: