తెలుగు రాష్ట్రాలలో వరుసగా రోడ్డు ప్రమాదాలు ఇటీవల చోటుచేసుకుంటున్నాయి. మితిమీరిన వేగంతో పాటు సరైన రోడ్లు బాగా లేకపోవడంతో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు ఇటీవల వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. ఇటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో భారీ ప్రమాదం జరిగింది. విషయంలోకి వెళితే ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు ఒక్కసారిగా చెరువులోకి దూసుకెళ్లి పోవటంతో అక్కడికక్కడే కారులో ఉన్న ముగ్గురు మరణించడం తో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల వివరాలను బట్టి చూస్తే..సర్నేని గూడెం సర్పంచ్ దర్నే రాణి భర్త దర్నే మధు, కుమారుడు మణికంఠ, కారు డ్రైవర్ శ్రీధర్ రెడ్డి చనిపోయారు. శుక్రవారం సాయంత్రం వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన వీళ్లు తిరుగు ప్రయాణంలో వస్తుండగా కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.

 

శుక్రవారం సాయంత్రం నుంచి వీళ్ళు కనిపించకపోయేసరికి మధు భార్య రాణి మరియు గ్రామస్తులంతా కలిసి వెతకటం జరిగింది. కానీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో వెంటనే మరో భార్య పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడం జరిగింది. మధు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వెల్లంకి సీసీ టీవీ ఫుటేజీ ద్వారా కారు చెరువులో పడినట్లు గుర్తించారు. దాంతో గ్రామస్తులతో కలిసి చెరువులో వెతకగా కారు బయటపడింది. కారులో వెళ్లిన ముగ్గురు కారులోనే మృతదేహాలుగా తేలారు. శివరాత్రి సందర్భంగా గ్రామంలోని గుడి వద్ద పలు కార్యక్రమాలు చేయించిన సర్పంచ్ మధు ఇంతలోనే మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

ఇదే సమయంలో ఘటనాస్థలానికి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దగ్గరుండి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం చెరువులో నుండి మృతదేహాల తో తీయడంతో పాటు ప్రమాదానికి గురైన కారు కూడా బయటకు లాగే ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రాంత ప్రజలు. దీంతో కొడుకుని మరియు భర్తని శవాలుగా చూడటంతో భార్య రాణి ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోవటం అక్కడ అందరినీ కలిచివేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: