ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి... విపక్ష  పార్టీలన్నీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నా  విషయం తెలిసిందే. అటు  అమరావతి రైతులు కూడా జగన్మోహన్రెడ్డి 3 రాజధానిల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో నిరసలు చేస్తున్నారు. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సర్కార్... మూడు రాజధానులకు  సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి  అసెంబ్లీలో ఆమోదం ముద్ర వేయించిన  విషయం తెలిసిందే. అయినప్పటికీ విపక్ష పార్టీలు మాత్రం తీవ్ర స్థాయిలో జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తూనే ఉంది. రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతు తెలుపుతూ... జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తోన్నాయి.

 

 

 జగన్మోహన్ రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయం వల్ల... ఆంధ్రప్రదేశ్ కు వచ్చే వ్యాపార సంస్థలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి అంటూ ప్రతిపక్ష టిడిపి పార్టీ విమర్శిస్తోంది. మూడు రాజధాని పేరుతో జగన్ సర్కార్ రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది అంటూ విరుచుకు పడుతున్నాయి విపక్ష పార్టీలు. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్మాణాన్ని మానుకోవాలి అంటూ హితవు పలుకుతున్నాయి. ఈ క్రమంలోనే విపక్ష పార్టీలు అధికార పార్టీ మధ్య విమర్శలు ప్రతి విమర్శలు పర్వం కొనసాగుతోంది. అటు విపక్షాలను విమర్శలపై అధికార వైసిపి పార్టీ గట్టిగా కౌంటర్ ఇస్తున్న విషయం తెలిసిందే.

 

 

 అయితే తాజాగా మూడు  రాజధానిల ప్రకటనపై సిపిఎం ఏపీ కార్యదర్శి మధు విమర్శలు గుప్పించారు. 3 రాజధానిల ప్రకటనతో అనేక వ్యాపారాలు హైదరాబాద్కు తరలి పోతున్నాయి అంటూ సిపిఎం ఏపీ కార్యదర్శి మధు అన్నారు. రాజధాని ప్రాంతం లోని కృష్ణాయ పాలెం లో రైతు దీక్షకు మద్దతు ఈ రోజు మద్దతు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన అన్నారు.... అమరావతి నుంచి రాజధాని తరలింపు అంశం ప్రభావం  అన్ని రంగాల అభివృద్ధి పై పడిందని రాజధాని తరలింపు అంశాన్ని జగన్ సర్కార్ విరమించుకోవాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు. చేయని నేరాలకు రాజధాని రైతుల పై అక్రమ కేసులు నమోదు చేయడం తగదు అని ప్రభుత్వానికి హితవు పలికారు సిపిఎం నేత మధు.

మరింత సమాచారం తెలుసుకోండి: