తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్తు ఎలా ? ఉండబోతోంది తిరిగి ఆమె రాజకీయంగా యాక్టివ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయా ? త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో కేసీఆర్ ఆమె కు రాజ్యసభ సీటు ఇస్తారా ? లేదా అన్న అంశాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా మారాయి. వాస్తవానికి క‌విత‌కు రాజ్యసభ సీటు ఇచ్చే విషయంలో కేసీఆర్ కుటుంబం లోనే తీవ్ర తర్జన భర్జనలు నడుస్తున్నాయని... కేసీఆర్ సైతం కవిత విషయంలో ఇంకా ఏమీ ఫైనలైజ్ చేయ‌లేక‌పోతున్నార‌ని.. ఈ విష‌యంలో ఆయ‌న ఎంతో మ‌ద‌న పడుతున్నార‌ని టీఆర్ఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.



ఇక కవిత విషయంలో కేటీఆర్ కూడా రాజ్యసభ కాకుండా మరో పదవి ఏదైనా ఇస్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న కూడా కేసీఆర్ మ‌దిలో ఉంద‌ట‌. మొత్తంగా చూస్తే ఇప్పటికే కెసిఆర్ ఫ్యామిలీ కే అన్ని పదవులు దక్కుతున్నాయి అన్న విమర్శలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. కేసీఆర్ , హరీష్‌రావు , కేటీఆర్ , సంతోష్ రావు , వినోద్ కుమార్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ కుటుంబానికి చెందిన వారందరూ కీలక పదవుల్లో ఉన్నారు. తెలంగాణ వచ్చాక మిగిలిన వాళ్ల సంగతి ఏమోగానీ కేసీఆర్ కుటుంబానికి మాత్రం పదవులు వచ్చాయన్న విమర్శలు ఉన్నాయి.



ఇక ఈ టైంలో ఎన్నికల్లో ఓడిపోయిన కవితకు మళ్లీ రాజ్యసభ సీటు ఇస్తే అది మ‌రిన్ని విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంద‌న‌డంలో సందేహం లేదు. దీంతో కెసిఆర్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారా ?అన్న సందేహం అందరిలోనూ ఉంది. అయితే ఎంపీగా ఓడిపోయాక‌ కవిత మాత్రం రాజకీయాల్లో చురుగ్గా ఉండటం లేదు. దీనికి ప్రధాన కారణం ఆమె రాజ్యసభ సీటుపై పడ్డారని తన మనసులో మాట ఇప్పటికేకీ తండ్రి కేసీఆర్‌కు చెప్పారని కూడా వార్తలు వస్తున్నాయి.



అయితే ఓడిపోయిన కుమార్తెకు మ‌ళ్లీ ప‌ద‌వి ఇవ్వ‌డం కేసీఆర్‌కు అంత ఇష్టంగా లేద‌ని మ‌రో టాక్‌. అదే టైంలో రెండు రాజ్యసభ పదవుల్లో ఒకటి బీసీకాని, దళిత వర్గానికి కాని ఇవ్వాలన్నది కేసీఆర్ ప్రతిపాదనగా చెబుతున్నారు. మ‌రొక‌టి రెడ్డి వ‌ర్గానికి ఇవ్వాల‌న్న ప్ర‌తిపాద‌న ఉంది. మ‌రి ఫైన‌ల్‌గా కేసీఆర్ తీసుకునే నిర్ణ‌యంపైనే క‌విత రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: