చదువుకోమని తల్లిదండ్రులు విద్యార్థులను కళాశాలలకు పంపిస్తే కొంత మంది విద్యార్థులు చేస్తున్న నిర్వాకాలకు తలలు ఎత్తుకోలేని పరిస్థితి నెలకొంటుంది.  తాజాగా విద్యార్థినుల హాస్టల్ రూమ్ లోకి ఓ యువకుడు ప్రవేశించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కృష్ణా జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఈ ఘటన జరిగింది.  నూజివీడు ట్రిపుల్ ఐటీలో కొన్ని రోజులుగా ‘ఫెస్ట్’ నిర్వహిస్తున్నారు. అందరూ ఆ పనుల్లో నిమగ్నం అయ్యారు. ఈ క్రమంలో అదే ట్రిపుల్ ఐటీలో రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి బాలికల హాస్టల్‌లోకి ప్రవేశించాడు.  అయితే ఈ విషయం తెలిసి కూడా  అందులో ఉన్న విద్యార్థినులు ఆ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకుని వెళ్లలేదు.  ఎట్టకేలకు ఈ విషయం తెలుసుకున్న కళాశాల సెక్యూరిటీ సిబ్బంది, అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

 

యువకుడు హాస్టల్ గదిలో ఉండేలా ఆరుగురు విద్యార్థినులు సహకరించారని ఆరోపణలు. ఈ నేపథ్యంలో ఆరుగురు విద్యార్థినులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై మిగిలిన విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపిలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాలకు ఎంతో పేరు ఉంది.. అలాంటి ఈ కళాశాలలో ఇలాంటి చిల్లర పనులు చేయడం వల్ల పరువు పోతుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  దీనిపై నూజివీడు ట్రిపుల్ ఐటీ ఇప్పటి వరకు ఎలాంటి విషయాన్ని కూడా తెలకపోవడం బాధాకరం అంటున్నారు.  మరోవైపు ఈ విషయంపై కళాశాల యాజమాన్యం సీరియస్ అయ్యింది.   

 

ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం విచారణకు ఆదేశించింది.పట్టుబడ్డ యువకుడు హాస్టల్ కిటికీ ఊచలు విరగ్గొట్టి గదిలోకి ప్రవేశించినట్లు తెలుస్తుంది. అయితే ఆ విద్యార్థికి అందులో యువతితో ఏదైనా పరిచయం ఉందా.. అందుకే అతను వచ్చినా విషయాన్ని బయటకు పొక్కకుండా ఉంచాారా అన్న విషయం పై క్లారిటీ లేదు. తమ తోటి విద్యార్థులు ఇలాంటి నీచానికి పాల్పపడటం..  మిగిలిన విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: