ఈ మద్య కొంత మంది కేటుగాళ్లు చేస్తున్న మోసాలు చూస్తుంటే దిమ్మతిరిది బొమ్మ కనిపిస్తుంది. సింపుల్ గా అనిపించినా కొంత మంది జాదూగాళ్లు చేసే మాయ లక్షలు, కోట్ల గడిస్తున్నారు.  హైటెక్ టెక్నాలజీతో కొంత మంది పోలీసుల కన్నుగప్పి చేస్తున్న మోసాలు బాధితులు చెప్పుకొని గుట్టు విప్పే వరకు తెలియని పరిస్థితి.  తాాజాగా ఇద్దరు కేటుగాళ్లు ఏకంగా మేక చర్మాన్ని పులి చర్మంగా చిత్రీకరించి లక్షలు దోచాలని ప్రయత్నించారు.  అయితే చేసిన మోసం ఊరికే దాగదు అన్నట్లు ఈ కేటుగాళ్ల గుట్టు రట్టయ్యింది.  ఇద్దరు నేరగాళ్లను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలిసు బృందం అరెస్ట్ చేసింది. వారు చేస్తున్న మోసాన్ని అడ్డుకొని ఆ ఇద్దర్ని కటకటాల వెనక్కి సాగనంపింది.

 

వివరాల్లోకి వెళితే.. హైద్రబాద్ పాతబస్తి బహదూర్ పురా ప్రాంతానికి చెందిన షేక్ మహమ్మద్ ముష్తాఖ్, హఫీజ్ బాబానగర్ కి చెందిన మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం మోసాలకు పాల్పడే వారు. అయితే ఈ మద్య ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు.. ఎలాంటి మోసాలకు పాల్పపడాలన్నా దొరికి పోతాం అని అనుకున్నారో ఏమో కానీ.. ఓ చిత్రమైన ఆలోచన ఆలోచించారు.  తాను పని చేస్తున్న చోట బొమ్మ జంతువులను అమ్ముకుంటున్న వ్యక్తిని గమనించిన ముష్తాఖ్.. ఓ దురాలోచన చేసి అమాయక జనాన్ని మోసం చేసి డబ్బు గుంజుదామనుకున్నాడు. అనుకున్నదే తడువు.. ఓ మేక చర్మాన్ని తీసుకొని దానికి అచ్చం పులి చారకలు పెయింటె వేసి..   పులి చర్మముగా నమ్మబలికి అమ్ముదామనుకున్నాడు .

 

అచ్చము పులి తోలులాగా కనిపించే ఆ మేక చర్మానికి  నకిలి దంతాలు, గోర్లు అమర్చి  ఖదీర్ తో కలిసి అమ్మేందుకు మిధాని బస్ డిపొ వద్దకు చేరుకున్నారు. అక్కడే వారి కర్మకాలింది.. వారి దగ్గరున్న ఆ చర్మాన్ని గమనించిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలీసులు అనుమానంతో ఇద్దర్నీ అదుపులొకి తీసుకున్నారు. వారి దగ్గర నుండి నకిలీ పులి చర్మము, నకిలీ పులి గోర్లు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కంచన్ బాగ్ పొలీసులకు అప్పగించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: