చాలా మంది సెక్స్ గురించి ర‌క ర‌కాల అపోహ‌ల‌తో బ్ర‌తుకుతుంటారు. లేనిపోనివ‌న్నీ పెట్టుకుని జీవితాన్ని అన‌వ‌స‌రంగా న‌ర‌కం చేసుకుంటారు. మ‌నిషికి వ‌య‌సు పెరిగే కొద్ది లైంగిక వాంఛ త‌గ్గుతుంది అన్న‌ది పూర్తి అపోహ‌. వందేళ్లు దాటిన వారిలో కూడా లైంగికపరమైన ఆశ‌క్తులు చచ్చిపోతాయనుకోవటనికి లేదు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు, పరిశోధనలు చాలానే జరిగాయి. మనుషులు మరణించే వరకూ కూడా లైంగికంగా ఆసక్తులయ్యే ఉంటారని వీటిలో స్పష్టంగా గుర్తించారు. కాకపోతే యుక్తవయసులో ఉండే ఆసక్తీ.. మలి వయసులో ఉండే ఆసక్తీ ఒకే రకంగా ఉండదు. యుక్తవయసులో ఉన్న వారిలా మలి వయసులో రోజుకోసారి సంభోగం వంటివి సాధ్యం కాకపోవచ్చు.

 

కానీ స్త్రీ, పురుషుల మధ్య సాన్నిహిత్యానికి ఉండే ప్రాముఖ్యం మాత్రం మనిషి మరణించే వరకూ కూడా తగ్గదు. కేవలం చేయి పట్టుకోవడమే కావచ్చు... అది కేవలం సాన్నిహిత్య భావనే కావచ్చు.. కానీ దానికీ ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి వయసుతో పాటు సెక్స్ వాంఛలు కోరికల రూపం మారొచ్చేమోగానీ ఆసక్తి తగ్గిపోవడ‌మన్నది మాత్రం ఉండదు. మ‌నిషి ఎల్ల‌ప్పుడూ త‌న శ‌రీరాన్ని స్ట్రాంగ్‌గా నిరంత‌రం ఎక్స్‌ర్‌సైజులు చేస్తూ ఉంటే ఎప్పుడూ కూడా లైంగికంగా బ‌ల‌హీన ప‌డే అవ‌కాశం అన్న‌ది ఉండ‌దు.

 

శారీర‌కంగా బ‌ల‌హీన ప‌డితే లైంగిక బ‌ల‌హీన ప‌డ‌తారు త‌ప్పించి మ‌నిషిలో ఉండే కోర్కెలు మాత్రం త‌గ్గ‌వు అని నిపుణులు చెబుతున్నారు. అలాగే స్గ్రీ, పురుషులు ఇద్ద‌రూ కూడా ఎప్పుడూ శారీర‌కంగా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎప్పుడైతే అలా స్ట్రాంగ్‌గా ఉంటారో అప్పుడే మ‌న‌సు, శ‌రీరం రెండూ కూడా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాయి. ఇవి తెలియ‌క చాలా మంది క‌నీసం వాకింగ్ కూడా చేయ‌కుండా ఎక్క‌డ కూర్చున్న గొంగ‌ళి అక్క‌డే అన్న విధంగా ఉండిపోతుంటారు. వాకింగ్ శ‌రీరానికి చాలా మంచిది. దాని వ‌ల్ల మ‌నుషులు చాలా యాక్టివ్‌గా ఉండ‌గ‌లుగుతారు. షుగ‌ర్‌, మోకాళ్ళ నొప్పులకు దూర‌మ‌వ‌డ‌మే కాకుండా ప‌డ‌క‌గ‌దిలో కూడా త‌మ స‌త్తాని చాట‌గ‌లుగుతారు. త‌మ భాగ‌స్వాముల‌ను సెక్స్ ప‌రంగా సంతృప్తి ప‌ర‌చ‌గ‌లుగుతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: