గుజ‌రాత్ రాష్ట్రంలో అన్నీ వింత వింతగా జ‌రుగుతుంటాయి. ఇటీవ‌లె అక్క‌డ శివానంద్ గ‌ర్ల్స్ కాలేజి విద్యార్ధుల‌ను బాత్‌రూమ్‌లో న‌గ్నంగా ఉంచి రుతుస్రావాన్ని చెక్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి మ‌ళ్ళీ వెలుగులోకి వ‌చ్చింది అదేమిటంటే... అక్క‌డ స్ట్రీకి గౌర‌వం అనేది లేకుండా పోతుంది. స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునేలా అక్క‌డివారు ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

 

ఇటీవ‌లె ఉద్యోగ అవ‌కాశాలు రాగా 10 మంది మ‌హిళ‌లు మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో ట్ర‌యినీ క్ల‌ర్క్‌లుగా నియ‌మితుల‌య్యారు. మూడు సంవ‌త్స‌రాల క‌నీస ట్ర‌యినింగ్ పూర్త‌య్యాకే వారికి ప‌ర్మినెంట్ జాబ్‌ని ఫిక్స్ చేస్తారు. ఈ నేప‌ధ్యంలో ప‌ర్మినెంట్ చేసే ముందు ఫిజిక‌ల్‌గా వారిని టెస్ట్ చేయ‌డం అన్న‌ది అక్క‌డి రూల్స్ ప్ర‌కారం త‌ప్ప‌నిస‌రిగా పాటిస్తారు. ఇక ఆ రూల్స్ ఎంత క‌ఠినంగా ఉంటాయంటే... చెప్పుకోడానికే సిగ్గుచేటు అన్న‌ట్లు ఉంటాయి. నియ‌మితులైన ప‌ది మందిలో ఎవ‌రైనా గ‌ర్భం ధ‌రించారా?  లేక ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌లేమ‌యినా ఉన్నాయా అని ప‌రీక్ష‌లు జ‌రుపుతారు. దానిలో భాగంగా సూరత్ లోని ఎస్.ఎం.ఐ.ఎం.ఇ.ఆర్ హాస్పిటల్లో ఆ మహిళా ఉద్యోగినులందరికి ఫిజికల్ టెస్ట్ నిర్వహించారు. ఈ ఫిజికల్ టెస్ట్ లో ఉద్యోగులందరిని ఒకే చోట నగ్నంగా నిలబెట్టి టెస్ట్ చేశారు.

 

ఈ ఫిజికల్ టెస్ట్ ను మహిళా డాక్టర్లే నిర్వహిస్తారు. అయిన‌ప్ప‌టికీ అందరినీ ఒకే సారి నగ్నంగా నిలబెట్టి టెస్ట్ చేయడం అన్న‌ది ఎంత ఘోర‌మైన ప‌రిస్థితో మ‌న‌కు వింటుంటేనే అర్ధ‌మ‌వుతుంది. మ‌రి ఆ ప‌రిక్ష చేయించుకునే వారి ప‌రిస్థితి ఇంక ఎలా ఉంటుందో ఒక సారి ఊహించండి. ఇక ఈ విష‌యం పై  పై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఒక్కొక్కరిని రూమ్ లోకి పిలిచి టెస్ట్ చేయాల్సింది పోయి అందరిని ఒకేసారి నగ్నంగా నిలబెట్టి టెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పెళ్లి కాని మహిళా ఉద్యోగులకు సైతం ప్రిగ్నెన్సీ టెస్ట్ లు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

తాము ఫిజికల్ టెస్ట్ కు వ్యతిరేకం కాదని..అయితే ఈ విధమైన చర్య చట్ట రిత్యా వ్యతిరేకం అమానవీయమైనదని మున్సిపల్ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. మీరు గతంలో గర్భం ధరించారా అంటూ మహిళా డాక్టర్లు ఉద్యోగినులను అసహ్యమైన ప్రశ్నలతో వేధించారని ఉద్యోగం సంఘం నాయకులు తెలిపారు. ఇంత అమానుషంగా ప్ర‌వ‌ర్తించిన వారి పై క‌ఠినమైన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ మేయ‌ర్ జ‌గ‌దీష్ ప‌టేల్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: