అధికారం కోల్పోయిన దగ్గర నుంచి చంద్రబాబుకు రాత్రులు సమయంలో నిద్రపడుతుందా? అంటే ఏమో కష్టమే అని చెప్పేస్తారు. ఎందుకంటే చంద్రబాబు అధికారం లేకపోతే అసలు ఉండలేరు. అలాంటిది ఐదేళ్లు అధికారంలో లేకుండా ఉండాలంటే చంద్రబాబుకు అసలు రాత్రులు నిద్రపట్టడం కష్టం. ఇక తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం దెబ్బకు బాబుకు ఇంకా నిద్రపట్టదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి మీద సిట్ విచారణకు జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఐదేళ్ల ప్రభుత్వ పాలనపై ఇంటిలిజెన్స్ డీఐజీ నేతృత్వంలో జగన్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.

 

ఇక ఈ సిట్ విచారణపై చంద్రబాబు స్పందిస్తూ... సీఎం జగన్ ఏమన్నా చేసుకోవచ్చునని, టీడీపీ అవినీతి చెయ్యలేదని, తమపై ఎన్ని రాజకీయాలు చేసినా భయపడమని, దిక్కున్నచోట చెప్పుకోమన్నానని మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి టీడీపీ అవినీతి చేసిందని ఆరోపణలు గుప్పిస్తున్నారని, గత 8 నెలలుగా ఇదే మాట చెబుతున్నారని, జగన్ తప్పులు చేసి ఇరుక్కుపోయారని, రాత్రులు నిద్ర లేని పరిస్థితి జగన్‌కు తప్పక వస్తుందని ఓ ఆవేశంగా మాట్లాడేశారు.

 

వాస్తవానికి రాత్రులు నిద్రపట్టని పరిస్తితి ఉంది బాబుకే. అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఆయనే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు కేసులు దెబ్బకు వచ్చే నిద్ర కూడా రాదు. దీంతోనే ఆయనకు సరిగా నిద్రలేక, జగన్‌కు నిద్రలేని రాత్రులు గడుపుతారని వార్నింగ్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. ఓ రకంగా జగన్ కూడా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారనే చేప్పొచ్చు.

 

ఎందుకంటే కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్, మంచి పాలన అందిస్తూ, ప్రజల కోసం కష్టపడుతున్నారు. 9 నెలల్లోనే మంచి మంచి పథకాలు అందించారు. ప్రజల మేలు కోసం సరికొత్త నిర్ణయాలు తీసుకున్నారు. ఓ వైపు ఇలా కష్టపడుతూనే, మరోవైపు టీడీపీ చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా కష్టపడుతున్న జగన్‌కు ఏ మేర నిద్రపడుతుందో కూడా చెప్పలేం.

మరింత సమాచారం తెలుసుకోండి: