ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్ – 19 (కరోనా వైరస్) విషయంలో చాలా దేశాలు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోక‌ప‌వడం వ‌ల్లే నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. చైనా ఇప్ప‌ట‌కీ క‌రోనా వైర‌స్ గుప్పిట్లో చిక్కుకుని విల‌విల్లాడుతోంది. క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్‌తో చైనాలో రోజుకు వంద‌ల మంది బ‌ల‌వుతున్నారు. వేల మంది ఈ వ్యాధి భారీన ప‌డుతున్నారు. అయితే క‌రోనా విష‌యంలో మ‌న దేశంలో చాలా రాష్ట్రాలు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకున్నాయి. ఈ క్ర‌మంలోనే ఏపీ స‌ర్కార్ సైతం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విజయవంతమైంది. సమీపంలోని కేరళలో కరోనా కేసులు నమోదవగా.. ఆ పరిస్థితి రాష్ట్రానికి ఎదురుకాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.



ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో  కరోనా వైర‌స్ సోకిన వారిలో 193 దేశాల నుంచి 187 మంది ఆంధ్రాకు వ‌చ్చారు. అయితే వారంద‌రిని బ‌య‌ట‌కు రాకుండా ఇళ్ల‌లోనే ఉంచి వైద్యం అందేలా చేయ‌డంలో ప్ర‌భుత్వం ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంది. అందుకే ఈ వైర‌స్ ఉన్న వ్య‌క్తుల నుంచి ఇత‌రులెవ్వ‌రికి సోకలేదు. చైనా నుంచి వచ్చిన ఐదుగురికి 28 రోజుల పాటు ప్రత్యేక పర్యవేక్షణ‌లో వైద్యం అందించారు.



ఇక జిల్లాల వారీగా కూడా జ‌గ‌న్ స‌ర్కార్ ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంది. ఎక్క‌డిక‌క్క‌డ జిల్లా హాస్ప‌టల్స్‌లో జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంతో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయిలో నోడల్ అధికారుల నియ‌మించి. రాష్ట్రంలో 24 గంట‌లు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వంతో పాటు వైద్య ఆరోగ్య శాఖా సిబ్బంది క‌రోనా వైర‌స్ రాష్ట్రంలోకి ఎంట‌ర్ కాకుండా ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలు ఉంటే మాస్కులు ధరించాలని.. ఎవ‌రికి అయినా సందేహాలు ఉంటే వెంట‌నే హాస్ప‌ట‌ల్స్‌కు వెళ్లాల‌న్న ప్ర‌చారం విస్తృతం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: