మున్సిపల్ చట్టం స్ఫూర్తి తో కొత్త జిహెచ్ఎంసి చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది . ఈ మేరకు జిహెచ్ఎంసి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం లో పురపాలక మంత్రి కేటీఆర్ వెల్లడించారు . నూతన మున్సిపల్ చట్టంలోని ప్రధాన అంశాలన్నీ ఈ చట్టంలో పొందుపరుస్తామని పేర్కొన్నారు . హైదరాబాద్ నగరవాసులకు మరింత మెరుగైన పురపాలన అందించేందుకే కొత్త జిహెచ్ఎంసి చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు . భవన నిర్మాణ అనుమతులు , శానిటేషన్ , గ్రీనరీ లకు ఈ చట్టం లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కేటీఆర్ తెలిపారు .

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్ బిపాస్ అమలుకు అవసరమైన చర్యలు చేపట్టడం తోపాటు , హెచ్ఎండిఏ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల జారీలో పారదర్శకత పాటించేందుకు చర్యలు తీసుంటామని చెప్పారు . మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో నూతన జిహెచ్ఎంసి చట్టం ఆమోదం కోసం ప్రయత్నిస్తామని కేటీఆర్ చెప్పారు . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నూతన పంచాయితీ రాజ్ , మున్సిపల్ చట్టాలను తీసుకువచ్చిన విషయం తెల్సిందే . త్వరలోనే రెవెన్యూ చట్టాన్ని కూడా తీసుకురావాలని భావిస్తోంది . రెవెన్యూ శాఖ లో   అవినీతి పరాకాష్టకు చేరుకుందని భావిస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్, నూతన  రెవెన్యూ చట్టాన్నితీసుకురావాలన్న ధృడ సంకల్పం తో ఉన్నట్లు ఆయన మాటల ద్వారా తెలుస్తోంది .

 

ఇప్పటికే నూతన చట్టం రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం . ఇక నూతన మున్సిపల్ చట్టం స్ఫూర్తి  తో , జిహెచ్ఎంసి చట్టంలోని మార్పులు , చేర్పులు చేసి నూతన చట్టాన్ని తీసుకురావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉన్నట్లు మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల ద్వారా స్పష్టం అవుతోంది . నూతన చట్టాల రూపకల్పన ద్వారా మెరుగైన పౌరసేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్నారు  మంత్రి .       

మరింత సమాచారం తెలుసుకోండి: