తప్పు చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టను అని పదేపదే చెబుతున్నారు వైసీపీ అధినేత జగన్. అధికారం చేపట్టిన తర్వాత టిడిపి లో ఉన్న కీలక నాయకులందరినీ టార్గెట్ చేసుకుని రాజకీయం నడుపుతారని, అందర్నీ వెంటాడి వేధిస్తారని అంతా భావించారు. అయితే దానికి భిన్నంగా జగన్ ప్రజా సంక్షేమ పథకాలు, కీలక నిర్ణయాలు తీసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. టిడిపి ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా ఉన్న పరిపాలనను గాడిలో పెట్టేందుకు ప్రయత్నించారు. కీలకమైన ప్రభుత్వ అధికారులను ఆయా శాఖలకు నియమించారు. కలెక్టర్లకు కూడా పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి ప్రజా సంక్షేమం విషయంలో ఎవరి మాట వినొద్దు అంటూ సూచించారు.


 మూడు రాజధానుల విషయంలోనూ జగన్ నిర్ణయానికి అనుకూలంగా కేంద్రం కూడా సపోర్ట్ చేసింది. ఇప్పుడు పూర్తిగా గత టిడిపి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, టిడిపి అధినేత చంద్రబాబు చేసిన అవినీతి వ్యవహారాలు కారణంగా కోట్లాది రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం అయ్యింది అనే విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు బయట పెట్టాలని జగన్ ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టారు. కేంద్రం టిడిపి నేతలే టార్గెట్ గా ఐటి దాడులు ఒకవైపు చేయిస్తుంటే జగన్ ఇప్పుడు విజిలెన్స్, సిఐడి, ఏసీబీ, సిట్ ఇలా అన్నింటిని రంగంలోకి దించారు. మొత్తం గత ప్రభుత్వంలో నెలకొన్న అవినీతి వ్యవహారాలు అన్నిటిని బయటకి తవ్వి తీస్తున్నారు. 


ఈ విధంగానే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ వంటివారు ఈ ఈ ఎస్ ఐ స్కాం లో ఉన్నట్లుగా సాక్ష్యాధారాలతో సహా వారి అవినీతి వ్యవహారాలను బయటపెట్టారు. ఇక గత టిడిపి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అందరి స్కాములు బయట పెట్టి ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి కే అన్ని శాఖల కు సంబంధించి అవినీతి వివరాలను రాబట్టినట్లు తెలుస్తోంది. జగన్ దూకుడు తో ఇప్పటికే టీడీపీ నాయకులు బెంబేలెత్తిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మొత్తం అవినీతి వ్యవహారాలు బయటకి వస్తుండడంతో మరింతగా ఆందోళన చెందుతోంది. చంద్రబాబును ఇరుకున పెట్టే విధంగా జగన్ ముందుకు వెళ్తున్నారు. ఈ విషయంలో కేంద్రం కూడా మద్దతుగా నిలవడంతో ఈ వ్యవహారం మరింత జోరందుకుంది
.

మరింత సమాచారం తెలుసుకోండి: