తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, ప్రముఖ వ్యాపారవేత్త రాయపాటి సాంబశివరావు ఆస్తులను వేలం వేయనున్నట్టు రెండు రోజుల క్రితం ఆంధ్ర బ్యాంకు పత్రికాప్రకటనను జారీ చేసింది. రాయపాటి రుణం తీసుకుని చాలా సంవత్సరాలైనప్పటికీ తీర్చలేకపోవడంతో ఆంధ్ర బ్యాంకు ఆస్తుల వేలానికి సిద్ధమైంది. 837 కోట్ల 37 లక్షల రూపాయలు రాయపాటి ఆంధ్ర బ్యాంకుకు బకాయి పడ్డారు. 
 
ఆంధ్ర బ్యాంకు గుంటూరులో రాయపాటికికి చెందిన 22,500 చదరపు అడుగుల కమర్షియల్ బిల్డింగ్ ను, న్యుఢిల్లీలోని ఫ్లాట్ ను మార్చి నెల 23వ తేదీన వేలం వేయనుంది. ఆంధ్ర బ్యాంకు వేలం వేస్తున్న గుంటూరు ప్రాపర్టీ విలువను 16 కోట్ల 44 లక్షల రూపాయలుగా, ఢిల్లీలోని ఫ్లాట్ ను ఒక కోటీ 9 లక్షల రూపాయలుగా నిర్ధారించారు. వేలం వేస్తున్న ఆస్తుల వివరాలు ఆంధ్ర బ్యాంకు వెబ్ సైట్ లో ఉంటాయి. 
 
రాయపాటి అప్పులు, వేలం వేస్తున్న ఆస్తుల విషయంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.రాయపాటి తీసుకున్న ఆస్తులకు ఇప్పుడు వేలం వేస్తున్న ప్రాపర్టీకి ఏ మాత్రం పొంతన లేదని వాదనలు వినిపిస్తున్నాయి. 837 కోట్ల రూపాయల అప్పుకు 17 కోట్ల రూపాయల ఆస్తులు వేలం వేయటం ఏమిటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆంధ్ర బ్యాంకుకు ఈ వేలం ద్వారా అంచనాల ప్రకారం పాతిక కోట్ల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది. 
 
మరి ఆంధ్ర బ్యాంకు మిగిలిన డబ్బులను ఎలా రికవరీ చేస్తుంది అంటే నిబంధనల ప్రకారం బ్యాంకు బినామీ ఆస్తుల చట్టం ద్వారా రాయపాటికి సంబంధించిన మిగతా ఆస్తులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్ర బ్యాంకు వేలం తరువాత బినామీ ఆస్తుల చట్టాన్ని ప్రయోగించి రాయపాటి ఆస్తులు స్వాధీనం చేసుకుంటుందా...? లేదా...? తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే. నెటిజన్లు సోషల్ మీడియాలో రాయపాటి అప్పులేమో కొండంత... బ్యాంకు వేలం వేస్తున్న ఆస్తులేమో గోరంత అని కామెంట్లు చేస్తున్నారు. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: