నూజివీడు ట్రీబుల్ ఐటీ లో లేడీస్ హాస్టల్ లో  మంచం కింద ఓ యువకుడు ఉండడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే నూజివీడు ట్రిపుల్ ఐటీ లో ప్రవేశించి ఆ యువకొన్న్ని  పోలీసులు అరెస్టు చేశారు. ఇక తాజాగా ఈ ఘటనలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. లేడీస్ హాస్టల్ లో పట్టుబడిన యువకుడు త్రిబుల్ ఐటీ విద్యార్థి అంటూ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. హాస్టల్ విద్యార్థునుల  సహకారంతో అతడు వసతి గృహం లోకి వచ్చి నైట్ మొత్తం అక్కడే ఉన్నట్లు  ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలోనే ఆరుగురు విద్యార్థులను  యూనివర్సిటీ యాజమాన్యం సస్పెండ్ చేసినట్లు వస్తున్నాయి. 

 

 అయితే ఈ ఘటనలో ఎవరినీ సస్పెండ్ చేయలేదని సమాచారం.. ఆ యువకుడు లేడీస్ హాస్టల్ లోకి వచ్చేందుకు సహకరించిన విద్యార్థులకు కేవలం కౌన్సిలింగ్ మాత్రమే ఇచ్చి పంపి వేశారని... లేడీస్ హాస్టల్ లోకి ప్రవేశించిన ఆ యువకుడిని కూడా కౌన్సిలింగ్ తోనే సరిపెట్టారు అంటూ సమాచారం. ఈ నేపథ్యంలో వర్సిటీ యాజమాన్యం తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సెక్యూరిటీ కళ్ళుగప్పి హాస్టల్ సిబ్బందినీ  మోసం చేసి లేడీస్ హాస్టల్లో రోజంతా గడిపిన  ఓ యువకుడిపై చర్యలు తీసుకోకపోవడం ఏమిటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక లేడీస్ హాస్టల్ సెక్యూరిటీ సిబ్బంది కేర్ టేకర్ లపై చర్యలు తీసుకోరా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

 ఇక ఈ ఘటనపై క్రమశిక్షణ కమిటీకి నివేదించనున్నట్లు  వర్సిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే సోమవారం నాడు వర్సిటీ క్రమశిక్షణ కమిటీ లేడీస్ హాస్టల్ లోకి వచ్చేందుకు సహకరించిన విద్యార్ధునులతోపాటు లేడీస్ హాస్టల్ లోకి వచ్చి ఒక రోజు మొత్తం గడిపిన కూడా యువకుడిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వర్సిటీ సెక్యూరిటీ లోపాలపై కూడా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: