కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్నారు. అయితే తాజాగా పౌరసత్వ సవరణ చట్టానికి నిర్వహించిన సభ నిర్వహించగా... పెద్దలందరూ ముందే సభ వేదికపై ప్రసంగించిన ఓ యువతి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన సభలో  పాకిస్తాన్ జిందాబాద్ తీవ్ర  వ్యాఖ్యలు చేసిన అమూల్య లియోన్ పై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదే విషయం పై శ్రీరామ సేనా  సభ్యులు షాకింగ్ కామెంట్ చేశారు. 

 

 పాకిస్తాన్ జిందాబాద్ అంటూ.. వ్యాఖ్యలు చేసిన అమూల్యను  హత్య చేసిన వారికి పది లక్షల బహుమతిగా ఇస్తాను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ సేనా నాయకుడిగా చెప్పకున్న  సంజీవ్ మరాఠీ బళ్ళారి లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రకమైన దేశ వ్యతిరేక చర్యలు క్యాన్సర్ లా  వ్యాపిస్తున్నాయి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు కాశ్మీర్ విద్యార్థుల నాలుకలను  కోసిన వారికి... మూడు లక్షలు ఇస్తాను అంటూ మరో శ్రీ రామ సేన నాయకుడు ప్రకటించడం సంచలనంగా మారింది. 

 

 అయితే సంజీవ్ తమ పార్టీ కాదని బళ్లారి బిజెపి నాయకులు ప్రకటించారు. ఇకపోతే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సేవ్ ఇండియా పేరుతో చేపట్టిన కార్యక్రమంలో విద్యార్థి అమూల్య.. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం పలు  ఉద్రిక్తత కు దారి తీస్తున్న విషయం తెలిసిందే. అమూల్య లియోన్  పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతో అక్కడున్న వారంతా షాక్కు గురయ్యారు. అమూల్య దగ్గరినుండి మైక్ లాక్కుని అలా అనొద్దు అంటూ చెప్పారు. అయితే పాకిస్తాన్ అనుకూలంగా నినాదాలు చేసిన అమూల్యకు నక్సల్స్ తో  కూడా సంబంధాలు ఉన్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్వయంగా ప్రకటించారు. దీంతో ఆమెపై 124a దేశద్రోహం కేసు నమోదు చేసి పోలీసులు 14 రోజుల కస్టడీ విధించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: