ఫిబ్రవరి 23వ తేదీన ఒక సారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది మరణాలు ఇంకెంతో మంది జననాలు జరిగాయి.  మరీ ఒక్కసారి చరిత్రలోకి వెళితే ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 ఏ ఆర్ రెహమాన్ : 91వ అకాడమీ అవార్డులలో భారతదేశానికి చెందిన ఏఆర్ రెహమాన్ కు రెండు ఆస్కార్ అవార్డులు లభించాయి. 

 

 బాబర్ జననం : మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు అయిన బాబర్ 1483 ఫిబ్రవరి 23వ తేదీన జన్మించారు. మధ్య ఆసియాకు చెందిన బాబర్  దక్షిణ ఆసియా లో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ భారతదేశంలో తన రాజ్యాన్ని స్థాపించి కలిగాడు. 

 

 నుజిల్లా లక్ష్మీ నరసింహం జననం  : వేద మూర్తులు సంస్కృతాంధ్ర భాషా ప్రవీణులైన న్యూజిల్లా లక్ష్మీ నరసింహం 1931 ఫిబ్రవరి 23వ తేదీన జన్మించారు. కేసరి హిందూధర్మ పరిరక్షణ కంకణ  దీక్షాపరులు. 

 

 సద్గురు బాబా హరదేవ్ సింగ్ మహారాజ్ జననం : సంత్  నిరన్కారి మండలం ఆధ్వర్యంలో గురుపూజ ఉత్సవం జరుగుతుంది. సద్గురు బాబా హరదేవ్ సింగ్ మహారాజ్ 1954 ఫిబ్రవరి 23వ తేదీన జన్మించారు. 

 

 కింజారపు ఎర్రన్నాయుడు జననం : తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు కేంద్ర మాజీ మంత్రి అయిన కింజారపు ఎర్రన్నాయుడు 1957 ఫిబ్రవరి 23వ తేదీన జన్మించారు. ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి 1982లో హరిశ్చంద్రపురం నియోజక వర్గం నుంచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1967 సంవత్సరంలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా హరిశ్చంద్రపురం నుంచి ఎన్నికైన కింజరాపు కృష్ణమూర్తి ఈయన చిన్నాన్న. ప్రస్తుతం ఈయన కుమారుడు కింజారపు రామ్మోహన్ నాయుడు టిడిపి తరఫున 2014 లోక్సభ ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు. ప్రస్తుతం టీడీపీ లోకి కీలక నేతగా కొనసాగుతున్నారు.  

 


 శ్రీ శ్రీనివాస్ జననం  : అమెరికన్ న్యాయ వేత్త అయిన శ్రీనివాస్  1967 ఫిబ్రవరి 23వ తేదీన జన్మించారు. తమిళనాడుకు చెందిన ఈయన కుటుంబం  1960 లో అమెరికా వెళ్లి స్థిరపడింది. 

 


 కరణ్ సింగ్ గ్రోవర్ జననం  : భారతీయ టెలివిజన్ నటులు మరియు మోడల్ ఆయన కరణ్  సింగ్ గ్రోవర్  1982 ఫిబ్రవరి 23వ తేదీన జన్మించారు. టెలివిజన్ పై ఎన్నో సీరియళ్ళలో  నటించడంతో పాటు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. 

 

 అన్నమయ్య మరణం : మొదటి వాగ్గేయకారుడు పద కవితా పితా మహుడు అన్నమయ్య. 1503 ఫిబ్రవరి 23వ తేదీన మరణించారు. అన్నమాచార్యులు తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు. అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: