ఇప్పటికీ అక్కడక్కడ పురాతనకాలం లాంటి గుహలు సొరంగ మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది మన పూర్వీకుల చరిత్రకు నిలువుటద్దాలు. అయితే ఇలాంటి గుహలు సొరంగ మార్గాలు చూసినప్పుడు ఎంతోమంది మురిసిపోతుంటారు. ఎందుకంటే మరోసారి ఆ గుహలు చరిత్రను గుర్తు చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ గృహ ఉంది కానీ ఇది చూసిన వారు మాత్రం భయం తో బెంబేలెత్తుతున్నారు. ఇంకొంతమంది అయితే అక్కడి నుంచి పరుగులు తీస్తున్నారు. ఇంతకీ ఆ గుహను చూసి అంతలా భయపడి పోవడానికి కారణం ఏమిటో... చెబితే మీరు కూడా భయపడతారు మరి. ఎందుకంటే ఆ గృహ నిండా మనుషుల ఎముకలే. ఎక్కడ చూసినా మనసులకు సంబంధించిన ఎముక లే కనిపిస్తూ ఉంటాయి. మరి ఇలా ఎముకలు కనబడ్డాక  భయపడకుండా ఎవరుంటారు చెప్పండి. 

 

 ఇంతకీ ఆ గుహ ఎక్కడ ఉంది ఎందుకు ఎముకలు  ఉంటాయో తెలియాలంటే వివరాల్లోకి వెళ్ళాల్సిందే.. స్పానిష్ కెనరీ ఐలాండ్ లోని  ఐలాండ్ ఆఫ్ గ్రాండ్ కెనేరీయాలో 8వ శతాబ్దానికి చెందిన ఓ రహస్య సమాధి గుహను పురావస్తు శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. దాదాపు 1000 సంవత్సరాలు కనుమరుగై ఉన్న ఈ గుహలను డ్రోన్  సాయంతో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఈ గుహ నిండా  ఎముకలు. ఎందుకంటే ఈ గుహలో 72 మంది మనుషుల ఎముకలు  బయటపడ్డాయి. ఈ ఎముకల్లో  62 మంది మధ్యవయస్కుల ఎముకల అయితే పది మంది చిన్న పిల్లలవి కూడా ఉన్నాయి అని శాస్త్రవేత్తలు గుర్తించారు. 

 


అయితే అప్పటికే కెనరీ ఐలాండ్ లో నివాసముంటున్న గుంజ తెగకు చెందిన వారి ఎముకల గా గుర్తించారు పురావస్తు శాఖ అధికారులు. అయితే ఈ గుహను కనుక్కోవడానికి వారు పడ్డ కష్టం గురించి శాస్త్రవేత్తలు తెలిపారు. మేము ఈ గుహను కనుక్కోవడానికి ఇక్కడికి చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది అంటూ తెలిపారు. ఇక్కడికి మనుషులు చేరుకునే అవకాశం లేదు కనుక ముందుగా డ్రోన్ సాయంతో ఈ గుహను అన్వేషించాము  అంటూ చెప్పుకొచ్చారు శాస్త్రవేత్తలు. 2019 జూన్ చివరి వారంలో ఈ గుహను కనుగొన్నప్పటికీ .. బయటికి చెబితే ఈ గుహను ధ్వంసం చేస్తారు పాడు చేస్తారని ఉద్దేశంతో వివరాలు అధికారికంగా ప్రకటించలేదు అంటూ... పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. అయితే అక్కడి అధికారులు సాయంతో గుహను  కాపాడుకోవాలని ఉద్దేశంతోనే ప్రస్తుతం ఈ విషయం బయట పెట్టామని వారు తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి: