తెలుగుదేశం పార్టీ నేతలే లక్ష్యంగా గత ప్రభుత్వ హయాం లో జరిగిన అవినీతి ,అక్రమాలపై  విచారణకు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పోలీసు దర్యాప్తు బృందం (సిట్ ) ఏర్పాటు చేశారా ?, మూడు రాజధానుల ఏర్పాటుకు ఒకవైపు శర వేగంగా అడుగులు వేస్తూనే , మరొకవైపు టీడీపీ ని టార్గెట్ చేస్తున్నారా ?? అంటే అవుననే రాజకీయ పరిశీలకులు అంటున్నారు . ప్రజావేదిక కూల్చివేత తో మొదలైన ఆపరేషన్  టీడీపీ మిషన్ , ఇప్పుడు సిట్ ఏర్పాటు తో పతాకస్థాయి కి చేరిందని విశ్లేషిస్తున్నారు .

 

రాష్ట్రం లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత టీడీపీ ని లక్ష్యంగా చేసుకుని , గత ప్రభుత్వ హయాం లో చేపట్టిన కార్యక్రమాలను తిరగదోడే పని చేస్తోంది  . దానిలో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది కరకట్ట పై కోట్లాది రూపాయల ప్రజాధనం తో  నిర్మించిన ప్రజావేదికను కూల్చాలని జగన్ సర్కార్  నిర్ణయించింది . అమరావతి లో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై దృష్టి సారించిన జగన్ సర్కార్ , భూకుంభకోణం తో ప్రమేయం ఉండదన్న కారణంగా మాజీ మంత్రులు పుల్లారావు , నారాయణలను టార్గెట్ చేసి , సిఐడి విచారణకు ఆదేశించిందన్న వాదనలు లేకపోలేదు  . ఇక తాజాగా ఈ ఎస్ ఐ పరికరాల కొనుగోళ్లలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రధాన నిందితునిగా చూపే ప్రయత్నాన్ని వైస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని  టీడీపీ నేతలు మండిపడుతున్నారు .

 

అయితే సిట్ ఏర్పాటు చేస్తే టీడీపీ నేతలు ఎందుకంత ఆందోళన చెందుతున్నారో,  తమకైతే అర్ధం కావడం లేదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ  అన్నారు . గతం లో దమ్ముంటే అక్రమాలను వెలికితీయాలని సవాల్ చేసిందే టీడీపీ నేతలంటూ గుర్తు చేశారు . ఇప్పుడు గత ప్రభుత్వ హయాం లో జరిగిన అవినీతి , అక్రమాలను వెలికి తీసేందుకు సిట్ ఏర్పాటు చేస్తే , తమని వేధిస్తున్నారనడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: