విశాఖ మిలీనియం టవర్స్ లో సచివాలయం ఏర్పాటును తూర్పు నావికాదళం వ్యతిరేకిస్తోందని ఒక ఆంగ్ల దినపత్రిక లో వచ్చిన వార్త కథనం లో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ప్రభుత్వం లో అంతర్భాగమైన  ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకటించింది . విశాఖ కేంద్రంగా పనిచేస్తోన్న తూర్పు నావికాదళం అభ్యంతరం వ్యక్తం చేయడం వల్ల, మిలీనియం టవర్స్ లో సచివాలయం ఏర్పాటున్నది జగన్ సర్కార్ కు సాధ్యం కాదంటూ సదరు కథనం లో పేర్కొనడం జరిగింది . విశాఖ ను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేయాలన్న జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలినట్లేనన్న ప్రచారం జరుగుతున్న నేపధ్యం లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చేసిన ప్రకటన , జగన్ సర్కార్ నెత్తిన పాలుపోసినట్లయింది .

 

మిలీనియం టవర్స్ లో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది . ఈ మేరకు ఉన్నతాధికారులు వెళ్లి టవర్స్ లోని కార్యాలయాలను పరిశీలించించడం జరిగింది . ఇక ఐటీ కార్యాలయాల ఏర్పాటు కోసం నిర్మించిన మిలీనియం టవర్స్ లో  ప్రభుత్వ  కార్యాలయాలను ... ఎలా  ఏర్పాటు చేస్తారంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తోన్న సమయం లో ఒక ఆంగ్ల దినపత్రిక లో వచ్చిన కథనం సంచనం సృష్టించింది . తూర్పు నావికాదళం నిజంగానే  సచివాలయం  ఏర్పాటుకు అభ్యంతరం వ్యక్తం చేసి ఉండి, ఉంటుంది కాబోలు అని అందరూ అనుకుంటున్న సమయం లో , ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసిన ప్రకటన ద్వారా ... ఈ కథనం వెనుక కుట్ర కోణం దాగి ఉందే మోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి .

 

జగన్ సర్కార్ ఏ కార్యక్రమం చేపట్టిన దాన్ని అభాసుపాలు చేసేవిధంగా కొన్ని పత్రికలు కథనాలు వండి వార్చడం ఆనవాయితీగా మారిన నేపధ్యం, మిలీనియం టవర్స్ లో సచివాలయం ఏర్పాటు పై తూర్పు నావికాదళం అభ్యంతరం వ్యక్తం చేసిందన్న కథనం కూడా అందులో భాగమై ఉంటుందని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు .    

మరింత సమాచారం తెలుసుకోండి: